Bigg Boss Telugu OTT Non Stop: Shanmukh Jaswanth Into BB House, See Video Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ హౌస్‌లో షణ్ముఖ్‌ జశ్వంత్‌

May 6 2022 9:05 PM | Updated on May 7 2022 7:58 AM

Bigg Boss OTT Non Stop: Shanmukh Jaswanth Into BB House - Sakshi

తాజాగా షణ్ను మరోసారి బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కంటెండర్స్‌ గేమ్‌ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్‌ ఆడించగా అందులో శివ గెలుపొందాడు. ఇప్పటికే అనిల్‌, బాబా భాస్కర్‌, బిందు పోటీదారులుగా ఎంపికవగా ఈ జాబితాలో శివ కూడా చేరినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ బిగ్‌బాస్‌కు వచ్చాక అతడిపై విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. సిరితో క్లోజ్‌గా ఉంటూ ఆమెపై పెత్తనం చెలాయిస్తున్నాడని, ఎవరితోనూ కలివిడిగా మాట్లాడనీయకుండా హద్దులు గీస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తి సునయన ఉందన్న విషయం మర్చిపోయి సిరితో ఎక్కువ సన్నిహితంగా మెదిలాడంటూ కామెంట్లూ వినిపించాయి. ఈ నెగెటివిటీతో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ కావాల్సిన షణ్ను రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్‌ తర్వాత తన ప్రేయసి కూడా గుడ్‌బై చెప్పడంతో ఒకింత శూన్యంలోకి వెళ్లిపోయాడు. అయితే తను చేసిన తప్పులను ఒప్పుకుంటూ తనను తాను సరిదిద్దుకుంటూ నెగెటివిటీని కూడా పాజిటివ్‌గా మార్చుకున్నాడు షణ్ను. దీంతో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు తిట్టినవాళ్లే షణ్ను మెచ్యూరిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

తాజాగా షణ్ను మరోసారి బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కంటెండర్స్‌ గేమ్‌ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్‌ ఆడించగా అందులో శివ గెలుపొందాడు. కానీ అఖిల్‌కు మిస్టరీ బాక్స్‌ రాగా అందులో ఎక్కువ పాయింట్స్‌ ఉన్నవాళ్లే గేమ్‌లో ముందుకు వెళ్లాలని రాసుంది. దీంతో ఇప్పటికే అనిల్‌, బాబా భాస్కర్‌, బిందు పోటీదారులుగా ఎంపికవగా ఈ జాబితాలో శివ లేదా అఖిల్‌లో ఎవరో ఒకరు చేరినట్లు తెలుస్తోంది. మరి హౌస్‌లో షణ్ను సందడి చూడాలంటే బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ చూడాల్సిందే!

చదవండి: ఇట్స్‌ టూ మచ్‌, అంత మేకప్‌ అక్కర్లేదు.. నటిపై ట్రోలింగ్‌

రోమాలు నిక్కబొడిచే 'కొమురం భీముడో' వీడియో సాంగ్‌ చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement