మహేశ్ విట్టా యూట్యూబర్, నటుడు, కమెడియన్. 2017లో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. యాక్టింగ్ టాలెంట్‌తో పలు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న ఆయన బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్నాడు. అయితే తన ఫ్రస్టేషన్‌ను పక్కనవారికి చెప్పుకోవడమే అతడి పాలిట శాపంగా మారింది. నారదుడు అన్న బిరుదును అతడికి అంకితమచ్చారు. అయితే అప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు భయముండేది.
కానీ ఇప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు జల్లికట్టులో ఎద్దు మాదిరిలా గుద్దుకుంటా పోతాడంతే.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పుకొచ్చాడు మహేశ్. బిగ్‌బాస్ తర్వాత ఆదాయం పెరిగింది, ఆటిట్యూడ్ మారింది, సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమా కూడా తీశానని చెప్పుకొచ్చాడు మహేశ్. ఊరమాస్‌గా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బుల్లితెరపై కూడా నవ్వులు పంచుతూ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంటాడా? అనేది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment