
యాంకర్ శివ.. యూట్యూబర్లకు బాగా పరిచయమున్న పేరు. వివాదాస్పద ఇంటర్వ్యూలతో సెన్సేషనల్ అయ్యాడు శివ. శ్రీకాకుళంలో పుట్టిన అతడు వైజాగ్‌లో విద్యనభ్యసించాడు. సెలబ్రిటీల నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్లను సైతం ఇంటర్వ్యూ చేసే ఆయన తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌కు రావడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు.
'నలభై వేలు ఖర్చు పెట్టి ఇంటర్వ్యూలు చేశాను. ఎడిటర్ దగ్గరకు వెళ్తే అతడు యాంకర్‌గా నువ్వు పనికిరావని ముఖం మీదే అనేశారు. డిజిటల్ మీడియాలో కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు చేయడానికి కారణం జనాల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే! ఎవరేమనుకున్నా కుర్చీలో కూర్చోవడం, కుర్చీలో కూర్చొని ప్రశ్నించడం ఇష్టం. ఒకానొక సమయంలో నేను ఇంట్లో అమ్మకు నచ్చలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడైతే డబ్బులు కావాలి, చెల్లి పెళ్లి చేయాలి, అదే నా టార్గెట్' అని చెప్పుకొచ్చాడు. 24 గంటలు మసాలా అందిస్తానంటూ హౌస్‌లోకి ప్రవేశించాడు శివ. మరి ఈ ఇంటర్వ్యూయర్ హౌస్‌లో ఎలా ఉంటాడు? ఎన్ని వారాలు ఉండగలుగుతాడో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment