బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ జరుగుతోంది. రెండు నెలలుగా కష్టపడి గేమ్ ఆడుతూ టాప్ 10లో చోటు దక్కించుకున్న కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించాడు. ఇప్పటికే అషూ తల్లి, నటరాజ్ మాస్టర్ భార్యాకూతురు, యాంకర్ శివ సోదరి, అఖిల్ తల్లి, అరియానా ఫ్రెండ్, మిత్ర ఫ్రెండ్ హౌస్‌లోకి వెళ్లారు. అందరూ వారికి తోచిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే అఖిల్ తల్లి మాత్రం శివతో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
కొడుక్కి రిలేషన్స్ పక్కన పెట్టి గేమ్ మీద దృష్టి పెట్టు. ఎవరేమన్నా ఇచ్చిపడేయ్.. అని సూచించిన ఆమె యాంకర్ శివ మీద మాత్రం వరుసగా సెటైర్లు వేసింది. 'గేమ్ ఆడుతున్నవా? లేదా దానం చేస్తున్నావా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే.. 'సరేలే, బిగ్‌బాస్‌కు రావాలన్నది నీ కోరిక.. నన్ను అడిగావా? లేదా? వస్తావని చెప్పానా? లేదా? వచ్చావు.. నీ కోరిక నెరవేరిపోయింది, హ్యాపీ..' అని చెప్పుకొచ్చింది. శివకు, తనకు గొడవలవుతున్నాయని అఖిల్ అనగా ఆమె మరోసారి శివ మీద అసహనం వ్యక్తం చేసింది. వాడు కావాలనే చేస్తాడు, కథలు పడుతుండు అని విమర్శించింది.
చదవండి: నా జిందగీలో నుంచే కాదు, నా బాడీలో నుంచి కూడా వదిలించుకున్నా
ఇప్పటిదాకా ఐదు సీజన్లు చూశావు, ఇది ఆరోదా.. అని అడుగుతూ నవ్వేసింది. దీంతో అఖిల్ కలగజేసుకుంటూ మా అమ్మ చెప్పినదాని కోసం ఏమనుకోకురా అని చేతులెత్తి వేడుకున్నాడు. అటు అఖిల్ తల్లి మాత్రం.. ఏ క్వశ్చన్ పేపర్ ఉందో దానికి సంబంధించింది చదివితేనే పాస్ అవుతరు. కానీ అన్ని క్వశ్చన్ పేపర్లు చదివేస్తే దేనికి దేనికి ఆన్సర్ రాయాలో అర్థం కాదు, నీ కాంట్రవర్సీ అలా అయిపోయింది అని సెటైర్లు వేస్తూనే చివర్లో మాత్రం బుజ్జగింపుగా బాగా ఆడుతున్నావు అని పేర్కొంది. శివ ఫస్ట్ టైం హౌస్‌లోకి వచ్చాడు కానీ ఇప్పటికే ఐదుసార్లు వచ్చినట్లు ఉందని పంచ్ వేసింది. ఆ తర్వాత హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు వర్షంలో తల్లీకొడుకులు కలిసి డ్యాన్స్ చేసి ఆనందించారు. దీంతో ఇతర హౌస్‌మేట్స్ కూడా మైకులు తీసేసి వర్షంలో చిందులేశారు.
చదవండి: బాలీవుడ్ నటికి సల్మాన్ ఖాన్ బంపర్ ఆఫర్, కావాల్సినంత తీసుకో!
Comments
Please login to add a commentAdd a comment