Bigg Boss Fame Sri Rapaka Comments On Prabhas Marriage - Sakshi
Sakshi News home page

Shree Rapaka: ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంతవరకు నేనూ చేసుకోను

Published Wed, Apr 6 2022 1:25 PM

Bigg Boss Fame, Actress Shree Rapaka Shocking Comments On Prabhas Marriage - Sakshi

Actress Sri Rapaka Comments On Prabhas Marriage: ప్రభాస్‌ పెళ్లి అంశం ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌ మారింది. ఈ డార్లింగ్‌ పెళ్లి ఎప్పుడెప్పుడాని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆయనకు ఉన్న  లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ ఒప్పుకుంటే పెళ్లికి రెడీ అంటూ ఎంతో మంది ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ మాత్రం ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు తాను కూడా చేసుకోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు ఆర్జీవీ ‘నగ్నం’ మూవీతో హీరోయిన్‌గా మారి తెలుగు బిగ్‌బాస్‌ ఓటీటీలో మెరిసిన బోల్డ్‌ బ్యూటీ శ్రీరాపాక.  

చదవండి: హైదరాబాద్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

రీసెంట్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీలో సందడి చేసిన ఈ  భామ రెండోవారమే ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి వరస ఇంటర్య్వూలతో ఫుల్‌ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రభాస్‌ పెళ్లిపై స్పందించింది. నాని అష్టా చమ్మ సినిమాలో ఆ హీరోయిన్‌ మహేశ్‌ మహేశ్‌ అంటూ కలవరించినట్టుగా శ్రీరాపాక ప్రభాస్‌ ప్రభాస్‌ అంటూ కలవరిస్తోంది. ప్రతి ఇంటర్య్వూలో ప్రభాస్‌ జపమే చేస్తోంది. అంతగా ప్రభాస్‌ను అభిమానిస్తున్న ఆమె ఆయన్ను కలిసే చాన్స్‌ మిస్‌ చేసుకున్నానంటూ వాపోయింది.

చదవండి: రామ్‌ గోపాల్‌ వర్మకు చేదు అనుభవం, స్పందించిన ఆర్జీవీ

ప్రభాస్‌ నటించిన ఈశ్వర్‌ మూవీ బాగా ఇష్టమని, అప్పటి నుంచి ప్రభాస్‌ అంటే క్రష్‌ అని చెప్పింది. మరి ఆయనను పెళ్లి చేసుకుంటారని అడగ్గా.. అంతకంటే అదృష్టమా అని సమాధానం ఇచ్చింది. అనంతరం ప్రుభాస్‌ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు జీవించిన చాలు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అయితే ఎలాగు అది జరగదు కాబట్టి ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్‌ చేస్తానని, ఆయన పెళ్లి తర్వాతే తను పెళ్లి పీటలు ఎక్కుతానంది. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోకపోతే తాను కూడా ఎప్పటికీ మ్యారేజ్‌ చేసుకోనని పేర్కొంది. కాగా శ్రీరాపాక హీరోయిన్‌ కంటే ముందు పలు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement