Bigg Boss OTT Telugu Latest Promo: బిగ్‌బాస్ హంగామా మళ్లీ మొదలైంది. కాకపోతే ఈసారి బుల్లితెరపై కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్. ఫిబ్రవరి 26న 17 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ప్రారంభమైందీ రియాలిటీ షో. వారియర్స్(మాజీ కంటెస్టెంట్లు), చాలెంజర్స్(కొత్త కంటెస్టెంట్లు) మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తాజాగా హాట్‌స్టార్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో యాంకర్ శివ అరియానాను పొగుడుతూ పులిహోర కలిపాడు. ఇంకా టాస్కులు, నామినేషన్లు మొదలవలేదు కాబట్టి ప్రస్తుతానికి అందరూ కలిసిపోయి సరదాగా నవ్వుకుంటున్నారు.
అయితే ప్రోమో చివర్లో మాత్రం అఖిల్ సార్థక్‌కు ఆర్జే చైతూ కోపం తెచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ అయిపోయాక శ్రీరాపాక ఓ సినిమా నిర్మిస్తుందట. అందులో సైకో క్యారెక్టర్ ఉందంటూ అఖిల్ భుజం తట్టాడు చైతు. దీంతో అఖిల్‌కు చిర్రెత్తిపోయింది. సోది టాపిక్ అని నసుగుతూ తను సైకో పాత్ర చేయడమేంటని అషూదగ్గర చిర్రుబుర్రులాడాడు. మరి అఖిల్ హర్ట్ అయ్యాడన్న విషయం చైతూకు తెలిసిందా? లేదా? హౌస్‌లో ఇంకా ఏమేం జరుగుతోంది? అన్నది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూసేయండి!
Comments
Please login to add a commentAdd a comment