సీపీఐ నారాయణపై తమన్నా సింహాద్రి అభ్యంతరకర వ్యాఖ్యలు | Tamanna Simhadri Shocking Reaction On CPI Narayana Comments Over Bigg Boss Show | Sakshi
Sakshi News home page

Tamanna Simhadri : సీపీఐ నారాయణపై తమన్నా సింహాద్రి అభ్యంతరకర వ్యాఖ్యలు

Published Sun, Feb 27 2022 10:26 AM | Last Updated on Mon, Feb 28 2022 12:09 PM

Tamanna Simhadri Shocking Reaction On CPI Narayana Comments Over Bigg Boss Show - Sakshi

Tamanna Simhadri Shocking Reaction On CPI Narayana Comments: బిగ్‌బాస్‌ రియాలిటీ షో క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో అన్ని భాషల్లో బిగ్‌బాస్‌ ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది. తెలుగులో ఇప్పటికే 5సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ ఇప్పుడు ఓటీటీలోకి ఎంటర్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌పై సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బిగ్‌బాస్‌ షో గేమ్‌ కాదని, లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌస్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి మండిపడింది. ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్న ఆమె బిగ్‌బాస్‌ షోను బ్రోతల్‌ హౌస్‌ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. ఈ షో వల్ల తమకు ఎంతో గుర్తింపు, ఉపాధి కలుగుతున్నాయని, ఒకవేళ షో నచ్చకపోతే ఛానెల్‌ మార్చుకోవాలంటూ సలహా ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement