
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ బుల్లితెరను కాదని కేవలం హాట్‌స్టార్‌లోనే ప్రసారమవుతోంది. అయితే 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ వీక్షించడం చాలా కష్టమంటున్నారు మెజారిటీ నెటిజన్లు. రెప్ప వాల్చకుండా షోను చూస్తూ ఉండటం ఇబ్బందేనని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇలాంటివాళ్ల కోసం ప్రతి రోజు తొమ్మిందింటికి ఒక గంట పాటు ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది బిగ్‌బాస్ టీమ్. ఈ వార్త విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోన్న విషయం తెలిసిందే! దీనికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో వదిలింది హాట్‌స్టార్.
వారియర్స్ టీమ్‌లో నుంచి ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులను ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆఫరిచ్చాడు. తేజస్వి, నటరాజ్ మాస్టర్ అరియానాను సెలక్ట్ చేయాలని అభిప్రాయపడ్డారు. సరయు.. హమీదా, అఖిల్ పేర్లను సూచించింది. అషూకు ముమైత్, మహేశ్ సపోర్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఫైనల్‌గా మెజారిటీ వారియర్స్ అఖిల్, అరియానా పేర్లను సూచించడంతో వారు కెప్టెన్సీకి పోటీపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై అషూ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసింది. నాకు ముమైత్, మహేశ్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు, పోనీ, వచ్చేవారం ప్రయత్నిస్తాను, ఇంకేం చేస్తాం అని అనుకుంటూనే రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసింది. మరి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఫస్ట్ కెప్టెన్ ఎవరయ్యారు? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment