Bigg Boss OTT Telugu Promo: Ariyana Glory Strong Counter To Shree Rapaka - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్‌ షోలో అప్పుడే గొడవలు, శ్రీరాపాకకు అరియానా రివర్స్‌ కౌంటర్‌

Published Sun, Feb 27 2022 8:48 PM | Last Updated on Mon, Feb 28 2022 1:38 PM

Bigg Boss Non Stop Promo: Ariyana Glory Strong Counter To Shree Rapaka - Sakshi

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ అంటే ఇష్టపడేవాళ్లు ఎంతోమంది. దేశంలోని పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ షో ఓటీటీ ట్రాక్‌ ఎక్కింది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌గా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో అందరూ సమానమే అంటూ ప్రోమో వదిలింది హాట్‌స్టార్‌.

ప్రతిరోజు చాలెంజర్స్‌ నుంచి అనుమతి పొందిన ఒక వారియర్‌కు మాత్రమే బెడ్‌రూమ్‌లో నిద్రపోయే అవకాశం లభిస్తుందని మెలిక పెట్టారు. చాలెంజర్స్‌ భోజనం చేసిన తర్వాతే వారియర్స్‌ ఒకేచోట కలిసి ఒకేసారి తినాలని నిబంధన పెట్టారు. వారియర్స్‌ సభ్యులు ఎవరే పని చేయాలో నిర్ణయించేందుకు చాలెంజర్స్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా జరిగింది. ఈ క్రమంలో శ్రీరాపాకకు, అరియానాకు మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇంటర్వ్యూలో ఓవరాక్టింగ్‌ వద్దని శ్రీరాపాక అనడంతో భగ్గున లేచింది అరియానా. స్టేట్‌మెంట్స్‌ ఇవ్వద్దు, నా స్టైల్‌ ఇలానే ఉంటుంది అని కౌంటరిచ్చింది బోల్డ్‌ బ్యూటీ. ఇక హౌస్‌లో నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. మరి ఎవరెవరు ఎవరెవర్ని నామినేట్‌ చేశారో తెలియాలంటే హాట్‌స్టార్‌లో నాన్‌స్టాప్‌ స్ట్రీమింగ్‌ చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement