
బిగ్‌బాస్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్. అలకలు, కొట్లాటలు, కయ్యాలు, కలవరింపులకు కొరతే లేకపోవడంతో ప్రేక్షకులు ఈ ఓటీటీ షోను ఆదరిస్తున్నారు. కాకపోతే ప్రతి సీజన్‌లో ఉన్నట్లుగానే ఈ సీజన్‌లో కూడా కంటెస్టెంట్లు ఎక్కువశాతం గ్రూపులు గ్రూపులుగానే ఆడుతున్నారు. అయితే నటరాజ్ మాస్టర్ మాత్రం సింగిల్‌గా ఆడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే హౌస్‌లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో బిందుమాధవి, అజయ్ పెద్దగా ఆడలేదు. శివ, అఖిల్, అరియానా, హమీదా, మహేశ్ సహా మరికొందరు బాగానే కష్టపడ్డారు. కానీ చివరగా హౌస్‌మేట్స్ మద్దతుతో కెప్టెన్‌ను ఎన్నుకోవాల్సి రావడంతో మరోసారి శివకు మొండిచేయి ఎదురైంది. అతడు కెప్టెన్ అవడం ఇష్టం లేదంటూ హౌస్‌మేట్స్ అతడిని కత్తితో పొడిచారు. అటు హమీదా, ముమైత్ సైతం కత్తిపోట్లు ఎదుర్కొన్నారు. తక్కువ కత్తిపోట్లు పడ్డ అషూ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది.
చదవండి: శ్రీహాన్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు, చివరికి ఇలా క్లారిటీ ఇచ్చిందా?
Comments
Please login to add a commentAdd a comment