Bigg Boss Non Stop Telugu OTT Contestant: మిత్ర శర్మ.. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూసేవాళ్లకు ప్రత్యేకంగా ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిత్రబిందగా ఆడియన్స్‌కు ఇప్పుడిప్పుడే దగ్గరవుతోందామె. అయితే హౌస్‌లో అందరూ తనను దూరం పెడుతున్నారంటూ నిన్నటివరకు ఏడ్చి గోల చేసిన మిత్ర.. ఇలా సాఫ్ట్‌గా ఉంటే లాభం లేదనుకుని తిరగబడింది. నామినేషన్స్‌లో తన ప్రతాపం చూపించినట్లు బిగ్‌బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో తెలుస్తోంది. ఇప్పటినుంచి ఆమె గేమ్ వేరే లెవల్‌లో ఉండేట్లు కనిపిస్తోంది.
ఇక మిత్ర శర్మ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తండ్రి పోయాక ఫ్యామిలీ తనను దూరం పెట్టడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా జీవిస్తోంది. అవకాశాల కోసం అనేక ఆఫీస్‌ల చుట్టూ తిరిగిన ఆమె తొలి సంధ్యవేళలో సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో సొంతంగా శ్రీపిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పింది.
చదవండి: కంటెస్టెంట్లపై నాగ్ ఫైర్, శ్రీ రాపాక అవుట్
ఈ బ్యానర్ ద్వారా బాయ్స్ సినిమా నిర్మించింది. అలా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కోట్లు ఆర్జించింది. ఆమెకు హైదరాబాద్‌లో ఇంద్రభవనం లాంటి ఇల్లు, కోటి 20 లక్షలు ఖరీదు చేసే బెంజ్ ఆల్టర్ కారు ఉన్నాయి. ఈ లగ్జరీ కారు ఇండియాలో పది మాత్రమే ఉంటే అందులో ఒకే ఒక్కటి హైదరాబాద్‌లో ఉంది. ఆ ఒక్క కారు కూడా మిత్రదే కావడం విశేషం.
ఈ కారుకు 999 అనే ఫ్యాన్సీ నంబర్ ఉంది. కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టపడే మిత్ర శర్మ పది కుక్కలను ఇంట్లో పెంచి పోషిస్తోంది. కుక్కపిల్లల కోసం ప్రత్యేకించి 5 బెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment