వినోదానికి లేదు ఫుల్‌స్టాప్ అంటూ వచ్చింది బిగ్‌బాస్ నాన్‌స్టాప్. హౌస్‌లో 24 గంటలు ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండంటూ ప్రేక్షకులను ఊరించింది. అదెలా సాధ్యమని ప్రశ్నించిన నోళ్లను 24/7 లైవ్ స్ట్రీమింగ్‌తో ఆశ్చర్యపరిచింది. అయితే రోజంతా షో చూడటం సాధ్యపడనివాళ్ల కోసం ప్రతిరోజు ఒక గంటపాటు ఎపిసోడ్ ప్రసారం చేస్తోంది. ఇప్పటికే షో ప్రారంభమై రెండు వారాలు పూర్తవగా ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యారు.
తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోపై ఆసక్తికర కామెంట్లు చేశాడు బిగ్‌బాస్ మాజీ విన్నర్ కౌశల్ మండా. 'బిగ్‌బాస్ షోలో ఎవరు గెలుస్తారన్నదానిపై నా అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. ఈసారి బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లో బిందుమాధవి గెలుస్తుంది. కొన్ని ప్రోమోలు చూశాను. అందులో బిందుమాధవి యాటిట్యూడ్, ఆమె సామర్థ్యాలు ఆవిడే గెలుస్తాయని చెప్తున్నాయి. రీ ఎంట్రీ ఇచ్చిన కొందరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్ గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ తడబడటం చూస్తుంటే నవ్వొస్తోంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. మరి నిజంగానే కౌశల్ మండా జోస్యం నిజమవుతుందా? లేదా? అనేది చూడాలి!
చదవండి: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment