
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు వచ్చేసింది. అఖిల్ సార్థక్, బిందు మాధవిలలో ఎవరు ఒకరు టైటిల్ ఎగరేసుకుపోనున్నారు. టాప్ 5కి చేరుకునేవారిలో నుంచి కొందరిని బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సైతం తీసుకోనున్నారు. ఆ జాబితాలో జనాలను ఎంటర్‌టైన్ చేసే యాంకర్ శివ తప్పకుండా ఉండే అవకాశముంది. అలాగే ఆరో సీజన్ కోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. బిగ్‌బాస్ టీమ్ రోషన్, మంజూష అనే మరో ఇద్దరు యాంకర్లను సైతం సంప్రదించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఓ యూట్యూబర్ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ పిలుపు వస్తే నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కల్యాణితో గొడవతో కొద్దిరోజులుగా అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లి అతడిని చితకబాదింది. దీంతో అతడు కూడా కల్యాణిపై చేయిచేసుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువురిపై కేసులు నమోదవగా పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..?
Comments
Please login to add a commentAdd a comment