
ఆర్జే చైతూ ఎలిమినేట్ కాకపోయుంటే ఈ వారం కెప్టెన్‌గా అతడు బిగ్‌బాస్ హౌస్‌ను ఏలేవాడు. కానీ ఊహించని ఎలిమినేషన్‌తో అతడు బిగ్‌బాస్ హౌస్‌ను వీడక తప్పలేదు. దీంతో ప్రస్తుతం ఇల్లు కెప్టెన్ లేకుండానే నడుస్తోంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో విసిరేసే స్టార్స్‌ను ఎవరైతే ఎక్కువగా దక్కించుకుంటారో వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇక ఎలాగైనా గెలవడం కోసం దొంగతనానికి కూడా వెనుకాడట్లేదు హౌస్‌మేట్స్. ఈ క్రమంలో తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడంటూ అఖిల్ మీద ఫిర్యాదు చేసింది హమీదా. తనమీద లేనిపోని నిందలేయొద్దని అఖిల్ వారించగా సంచాలకురాలిగా వ్యవహరించిన అషూ వీరి గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేసింది.
ఇదిలా ఉంటే ఈ రోజు తెల్లారేసరికి కొందరి స్టార్లు చోరీ అయ్యాయట. అతడెవరో తెలిసినా చెప్పనని బుకాయించింది అరియానా. మరోపక్క అషూ.. అఖిల్ మీద అలిగింది. నా మీద అరిచేస్తూ, హర్ట్ చేసి సారీ చెప్పకని కుండ బద్ధలు కొట్టింది. గేమ్‌లో నటరాజ్ మాస్టర్ స్టార్లు దాచుకున్న కవర్ చినగడంతో వాటన్నింటినీ మిగతా కంటెస్టెంట్లు లాగేసుకున్నారు. దీంతో చిర్రెత్తిపోయిన మాస్టర్ ఏం చేయాలో అర్థం కాక తన చెంపలు వాయించుకుని ఏడ్చేశాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ కెప్టెన్ ఎవరన్నది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment