
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఈసారి ఐదుగురు కాకుండా ఆరుగురు ఫినాలేకు చేరుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్లు వరుసగా హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. హౌస్‌మేట్స్‌తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం గేమ్ ఆడిస్తున్నారు. ఇప్పటికే సిరి, మానస్ హౌస్‌లోకి రాగా తాజాగా యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు.
ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న హౌస్‌మేట్స్‌తో మరో టాస్క్ ఆడించాడు. అయితే దీనికంటే ముందు వాళ్లతో ఫన్నీ స్కిట్స్ వేయిస్తూ ప్రేక్షకులను తెగ ఎంటర్‌టైన్ చేశాడు. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరి సొంతం కానుంది? ఈ పాస్‌తో ఎవరు గేమ్‌ను మలుపు తిప్పనున్నారు అనేది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ..
Comments
Please login to add a commentAdd a comment