Bigg Boss OTT Non Stop: Hamida Eliminated For 9th Week of BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: అనిల్‌ అదృష్టం, బిగ్‌బాస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌!

Published Sun, May 1 2022 9:56 AM | Last Updated on Sun, May 1 2022 11:46 AM

Bigg Boss OTT Non Stop: Hamida Eliminated For 9th Week Of BB House - Sakshi

బిగ్‌బాస్‌ షో చివరకు చేరుకుంటోంది. ఫ్యామిలీ ఎపిసోడ్‌తో హౌస్‌ ఎమోషనల్‌గా మారింది. ప్రస్తుతం హౌస్‌లో అషూ, అరియానా, నటరాజ్‌ మాస్టర్‌, అనిల్‌, మిత్ర శర్మ, యాంకర్‌ శివ, బిందుమాధవి, హమీదా, అఖిల్‌, బాబా భాస్కర్‌ ఉన్నారు. వీరిలో అషూ, అఖిల్‌, బిందు మినహా మిగతా అందరూ నామినేషన్‌లో ఉన్నారు.

ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌ అయినట్లు లీకువీరులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గత ఎనిమిది వారాలుగా నామినేషన్స్‌, ఎలిమినేషన్‌ విషయంలో వాళ్లు చెప్పిందే నిజమవుతూ వస్తోంది. ఈ లెక్కన బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి తొమ్మిదవ వారం హమీదా బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా అనిల్‌ను ఎలిమినేట్‌ చేయాలనుకున్నారని, కానీ ఏదో సమస్య వల్ల చివరి నిమిషంలో హమీదాను పంపించివేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఏదేమైనా అనిల్‌కు లక్‌ బాగానే ఉందంటున్నారు బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌.

చదవండి: మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే, నేనూ లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement