బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రెండోవారంలో అడుగుపెట్టింది. రెండోసారి కూడా నామినేషన్లు రసవత్తరంగా మారాయి. వారియర్స్ టీం నుంచి ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్‌ను మాత్రమే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ఫొటోపై కత్తి గుచ్చి నామినేషన్ ప్రక్రియ కొనసాగించాలని సూచించాడు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారో కింది స్టోరీలో చదివేయండి.
ముందుగా సరయు వంతు రాగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడంటూ యాంకర్ శివను నామినేట్ చేసింది. తర్వాత అషూరెడ్డి.. గేమ్ మీద ఫోకస్ పెట్టడం లేదంటూ మిత్రశర్మను నామినేట్ చేసింది. అఖిల్.. యాంకర్ శివను నామినేట్ చేస్తూ అతడిపై సెటైర్లు విసిరాడు. ఇంట్లో ఉండాలంటే అర్హత ఉండాలని, నీమీద నీకు నమ్మకం లేకపోతే ఇంట్లో ఉండి వేస్ట్ అని విమర్శించాడు.
తేజస్వి.. అతడిని నామినేట్ చేస్తే కానీ అసలు గేమ్ బయటకు రాదంటూ అనిల్‌ను నామినేట్ చేసింది. మహేశ్ విట్టా కూడా తేజు చెప్పిన కారణమే చెప్తూ అనిల్ ఫొటోపై కత్తితో గుచ్చాడు. నటరాజ్ మాస్టర్.. శివను నామినేట్ చేసే క్రమంలో వీరిద్దరికి మధ్య పెద్ద ఫైటే జరిగింది. హమీదా.. మిత్రను, అరియానా.. శ్రీరాపాకు నామినేట్ చేశారు. చాలెంజర్స్ టీమ్.. వారియర్స్‌లో ఇద్దరిద్దర్ని నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో మొదటగా ఆర్జే చైతూ.. అఖిల్, అరియానాను; స్రవంతి చొక్కారపు.. సరయు, నటరాజ్ మాస్టర్‌ను; శ్రీరాపాక.. అరియానా, సరయును; అనిల్.. సరయు, హమీదాను నామినేట్ చేశారు.
అజయ్.. సరయు, మహేశ్ విట్టాను; బిందు మాధవి.. నటరాజ్ మాస్టర్, సరయును; మిత్ర శర్మ.. అషూ, హమీదా; యాంకర్ శివ.. సరయు, అఖిల్‌ను నామినేట్ చేశారు. యాంకర్ శివ సరయును నామినేట్ చేసే క్రమంలో తాను డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్‌లో నుంచి వెళ్లిపోతానని సవాలు విసిరాడు. దీంతో ఫైనల్‌గా 11 మందికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఈ వారం సరయు, అఖిల్, హమీదా, అనిల్, మిత్ర శర్మ, అరియానా, శివ, నటరాజ్, అషూ, శ్రీరాపాక, మహేశ్ నామినేషన్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment