
నగరి (చిత్తూరు): బిగ్ బాస్ కార్యక్రమం పై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శనివారం ఆయన చిత్తూరు జిల్లా నగరిలో విలేకరులతో మాట్లాడారు. యువతను పెడదారి పట్టిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిషేధించాలని గతంలో తాను హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు.
బిగ్ బాస్‌పై దాఖలైన ఓ రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బ్యాన్ చేసే బాధ్యతను తీసుకోవాలని హైకోర్టుకు నారాయణ విజ్ఞప్తి చేశారు.
చదవండి: (బిగ్‌బాస్ లాంటి షోలతో యువత పెడదారి పడుతోంది: హైకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment