
గతేడాది బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో బిగ్‌బాస్. దాదాపు 100 రోజులకు పైగా సినీ ప్రేక్షకులను అలరించింది. డిసెంబర్ 17న ముగిసిన ఈ సీజన్‌లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర నటుడు అమర్‌దీప్ రన్నరప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే అంతకుముందు జరిగిన సీజన్లతో పోలిస్తే ఈ సారి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు త్వరలోనే మరో సీజన్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ మొదలు కానున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ రియాలిటీ షో ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7లో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు. ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో సారి కూడా ఎలిమినేట్ అయి బయటకొచ్చిన కంటెస్టెంట్ రతికా రోజ్. అయితే మరోసారి రతికా బిగ్‌బాస్ షోకు వెళ‍్లనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ సీజన్‌లో రతికా ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రతికా ఓ సినిమాలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment