రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చింది యాంకర్ స్రవంతి చొక్కారపు. సోషల్ మీడియా నుంచి టీవీ దాకా సాగిందామె ప్రయాణం. బిగ్‌బాస్ స్టేజీపై ఐదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన స్మైల్ గురించి రోజుకో వంద కామెంట్లు వస్తాయంటూ సిగ్గుపడిపోయింది. కానీ కొన్నిసార్లు బాడీ షేమింగ్ కామెంట్లు కూడా చేస్తారని మూతి ముడుచుకుంది. ఇక తాను రెండుసార్లు పెళ్లి చేసుకున్నానన్న విషయాన్ని బయటపెట్టింది.
మొదటిసారి ప్రేమ వివాహం చేసుకోగా రెండోసారి పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అయితే ఈ విషయం ప్రేక్షకులకు ఇంతవరకు తెలియదని పేర్కొంది. బిగ్‌బాస్ ఓటీటీలో నవరసాలతో ఎంటర్‌టైన్ చేస్తానని మనసావాచా కర్మణా మాటిస్తున్నానంటూ శపథం చేసింది స్రవంతి. మరి ఈ మాటను ఆమె నిలబెట్టుకుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment