బిగ్‌బాస్ షోలో ఎక్కువమంది ఇష్టపడే ప్రక్రియ నామినేషన్స్. ఇక్కడే కంటెస్టెంట్ల అసలు స్వరూపం బయటపడుతుంది. ఒకరినొకరు నామినేట్ చేసుకునే క్రమంలో కొట్లాటలకు దిగుతారు హౌస్‌మేట్స్. తాజాగా హౌస్‌లో ఐదో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయని ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది.
మిత్రతో ఈ మధ్య చనువుగా మెదులుతున్న అరియానా నామినేషన్స్‌లో ఆమె పేరునే తీసుకురావడం కొసమెరుపు. ఇంప్రెషన్‌ను ఫామ్ చేయడం నచ్చలేదంటూ మిత్రను, తాను రెండురకాలుగా గేమ్ ఆడుతున్నానని కామెంట్ చేసిన బిందుమాధవి ఫొటోలను మంటల్లో వేసింది.
నామినేషన్స్ చేసుకునే క్రమంలో అజయ్, అషూ రెడ్డిలతో హమీదా గట్టిగానే పోరాడింది. అనిల్ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేయడంతో ఆయన తిరిగి అనిల్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత స్రవంతిని శకునితో పోల్చడంతో ఇద్దరి మధ్య అగ్ని రాజుకుంది.
అలాగే బిందుమాధవి దూషిస్తోందంటూ ఆమె ఫొటోను అగ్నిలో కాల్చేశాడు మాస్టర్. మాట్లాడే దమ్ములేదా అంటూ మాస్టర్‌కే ఎదురుతిరిగింది బిందు. ఫైనల్‌గా ఈ వారం అజయ్, అషూ, మిత్ర, మహేశ్, హమీదా, అరియానా, నటరాజ్, అనిల్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment