సాధారణంగా బిగ్‌బాస్ షోలో సండే అనగానే ఫండే అంటూ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాడు నాగార్జున. కానీ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోలో మాత్రం ఫన్ అండ్ ఫ్రస్టేషన్ రెండూ చూపిస్తాడు. ఇక ఈ వారం అయితే ఎన్నడూ లేనంతగా సీరియస్ అయ్యాడు. హౌస్‌మేట్స్ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ముందుగా నాగ్ హౌస్‌మేట్స్‌ను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ నిన్ను మోసం చేస్తుంది ఎవరో చెప్పాలన్నాడు.
మోసం చేసేంత చనువు తానెవరికీ ఇవ్వలేదని తెలివిగా ఆన్సరిచ్చాడు మహేశ్ విట్టా. అసలు ఈ హౌస్‌లో ఎవరినీ నమ్మడం లేదని తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది హమీదా. ఇక నటరాజ్ మాస్టర్ యాంకర్ శివ మోసం చేస్తున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. చివరికి అతడు బిందును కూడా మోసం చేస్తాడన్నాడు. స్రవంతి.. తను ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్‌గా భావించిన అఖిల్, అజయ్ మోసం చేశారని తెలిపింది. యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్ పేరు చెప్పాడు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్‌కు లుంగీ ఎత్తి చూపించడం కరెక్ట్ అనుకుంటున్నావా? అని సూటిగా ప్రశ్నించాడు.
దానికి శివ సరదాగా అన్నానని చెప్పగా బిగ్‌బాస్ వీడియో ప్లీజ్ అంటూ అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అటు మాస్టర్ బూతులు మాట్లాడటాన్ని కూడా తప్పుపట్టాడు నాగ్. 23 ఏళ్ల అనుభవం ఉంది.. ఆ బూతులు మాట్లాడటమేంటి? అని ప్రశ్నించడంతో నటరాజ్ నీళ్లు నమిలాడు. మరోవైపు లుంగీ ఎత్తడం తప్పు అని శివను హెచ్చరిస్తుండగా పదేపదే మధ్యలో కలగజేసుకున్న మాస్టర్ మీద ఫుల్ ఫైర్ అయ్యాడు హోస్ట్. మాస్టర్ సైలెంట్, నేను అతడితో మాట్లాడుతున్నాను కదా అని మండిపడ్డాడు. మరి నాగ్ చేతిలో ఎవరికి కోటింగ్ పడతాయి?, ఎవరికి కాంప్లిమెంట్స్ దక్కుతాయో తెలియాలంటే నేడు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: ఏడేళ్ల లవ్.. చూడకూడని స్థితిలో బావను చూశాను: అరియానా బ్రేకప్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment