Bigg Boss Non Stop: Mithra Sharma Gets Emotional While Watching Her Father Photo, Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: ఆయన ఫోటో చూసి భోరున విలపించిన మిత్రాశర్మ

May 3 2022 11:07 AM | Updated on May 3 2022 11:39 AM

Bigg Boss Non Stop: Mithra Sharma Gets Emotional While Watching Her Father Photo - Sakshi

బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో తన ఆటతీరుతో దూసుకెళ్తోంది మిత్రాశర్మ. ‘తొలి సంధ్య వేళలో' మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన మిత్ర.. ఆ తర్వాత శ్రీ పిక్చర్స్‌ బ్యానర్‌ స్థాపించి బాయ్స్‌ అనే సినిమాను కూడా నిర్మించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యేందుకే బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లోకి వచ్చింది. తొలుత కాస్త తడబడినా.. ప్రస్తుతం తనదైన గేమ్‌తో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మారింది.

హౌస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన మిత్ర..తాజాగా ఓ ఫోటో చూసి భోరున విలపించింది. వివరాల్లోకి వెళితే... గతవారం హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ని పంపించాడు బిగ్‌బాస్‌. దాదాపు అందరి కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ మిత్రాశర్మకి తల్లిదండ్రులు లేకపోవడంతో.. ఎవరిని ఇంట్లోకి పంపలేదు. ఇక వీకెండ్‌లో నాగార్జున వచ్చి మిత్రాశర్మ తండ్రి ఫోటోని హౌస్‌లోకి పంపించాడు. అది చూసి మిత్ర ఎమోషనల్‌ అయింది.

ఇంట్లోకి అందరి కుటుంబ సభ్యులు వచ్చారు.. కానీ నాకు నా అనేవాళ్లు లేరంటూ భోరున విలపించింది. తను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడానికి తన తండ్రే కారణమని చెప్పింది. ఇక తనతో మాట్లాడానికి వచ్చిన సిరి, గంగాధర్‌లను చూసి కూడా మిత్రాశర్మ కనీళ్లు పెట్టుకుంది. గంగాధర్‌ తనకు తండ్రిలాంటి వాడని, ప్రతి విషయంతో నాకు సపోర్టుగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఇక గంగాధర్‌ మాట్లాడుతూ.. మిత్ర సివంగి అని, బయట ఎలా ఉంటుందో...బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా అలానే ఉందని చెప్పాడు. ఇక సిరి హన్మంత్‌ అయితే మిత్రాశర్మపై ప్రశంసల వర్షం కురిపించింది. టాప్‌ 5లో కచ్చితంగా మిత్రాశర్మ ఉంటుందని జోస్యం చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement