
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో బంధాలు, అనుబంధాల సంగతేమో కానీ కొట్లాటలు, కయ్యాలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. బిగ్‌బాస్ ఏ ముహూర్తాన కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్‌గా విడగొట్టాడో రోజురోజుకీ వారు బద్ధ శత్రువుల్లా తయారవుతున్నారు. బిగ్‌బాస్ చెప్పిన రూల్స్ పాటించడం లేదంటూ ఒకరి టీమ్ మీద మరొకరు బురద చల్లుకుంటున్నారు. అసలు రూల్స్ పెట్టినా చాలెంజర్స్ దాన్ని పాటించడం లేదని వారియర్స్ అసహనానికి లోనయ్యారు. వాళ్లు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన ఆడినప్పుడు బిగ్‌బాస్ సరైన తీర్పు ఇవ్వకపోతే మాత్రం తాను కూడా రూల్స్ ఫాలో కానని తేల్చి చెప్పాడు అఖిల్ సార్థక్.
టాస్క్‌లో మహేశ్ విట్టా అనిల్‌ను అరేయ్ అనడంతో అతడు రెచ్చిపోయాడు. అరేయ్, గిరేయ్ అంటే పడను అని వార్నింగ్ ఇచ్చాడు. ఫైనల్‌గా చాలెంజర్స్ గెలిచినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. దీంతో నటరాజ్ మాస్టర్ ఎంత కష్టపడి ఆడినా ఫలితం దక్కలేదని కంటతడి పెట్టుకున్నాడు. మరోపక్క మిత్రా శర్మ.. చాలెంజర్స్ లిస్టులో తనను చివరి వ్యక్తిగా చూస్తున్నారంటూ ఏడ్చేసింది. ఇదిలా ఉంటే అనిల్ హౌస్‌కు రెండో కెప్టెన్‌గా అవతరించినట్లు లీకువీరులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment