RGV Supports Shree Rapaka Instead Of Ariyana And Ashu Reddy, Tweet Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: అరియానా, అషూలకు ఆర్జీవీ షాక్‌, వీళ్లను కాదని ఆమెకు సపోర్ట్‌!

Published Mon, Feb 28 2022 11:34 AM | Last Updated on Mon, Feb 28 2022 12:19 PM

Bigg Boss OTT Non Stop: RGV Supports Shree Rapaka Instead Of Ariyana, Ashu Reddy - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ ఈసారి మరింత కలర్‌ఫుల్‌గా ఉంది. హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్లు అడుగుపెడితే అందులో పది మంది అమ్మాయిలే కావడం గమనార్హం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవచ్చేమోకానీ, ఒకే ఇంట్లో రెండు కొప్పులు ఇమడవు అని ఓ సామెత ఉంది. అలాంటిది బిగ్‌బాస్‌ హౌస్‌లో 10 మంది అమ్మాయిలు ఒకేచోట ఉన్నారు. మరి కలిసుంటారా? కొట్లాటలతో హౌస్‌ను హీటెక్కిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ బిగ్‌బాస్‌లోని ఓ కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. నగ్నం హీరోయిన్‌ శ్రీరాపాకకు ఆల్‌ద బెస్ట్‌ చెప్తూ వీడియో రిలీజ్‌ చేశాడు. దీంతో అవాక్కైన నెటిజన్లు అరియానా, అషూ రెడ్డి పరిస్థితేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అరియానాకు మద్దతిచ్చారు, ఆమె టాప్‌ 5లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు రాపాకకు సపోర్ట్‌ అంటున్నారంటే, ఈమె కూడా ఫినాలే వరకు ఉంటుందోమో చూడాలి అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్‌ అయింది అరియానా. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొన్నప్పుడు ఈ బోల్డ్‌ బ్యూటీకి మద్దతు పలికాడు వర్మ. అటు అషూతోనూ ఇంటర్వ్యూలు చేస్తూ రచ్చరచ్చ చేశాడు. దీంతో ఈసారి ఆర్జీవీ సపోర్ట్‌ ఈ ఇద్దరికీ తప్పకుండా ఉంటుందని ఫ్యాన్స్‌ ఊహించారు. కానీ ఆ ఊహలను పటాపంచలు చేస్తూ తను డైరెక్ట్‌ చేసిన నగ్నం సినిమా హీరోయిన్‌ శ్రీరాపాకకు ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున్నాడీ దర్శకుడు. మరి ఆమె బిగ్‌బాస్‌ ఓటీటీలో ఎలా రాణిస్తుందో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement