Abhay Deol Says He Feels Manipulated by Film Directors He Worked With - Sakshi
Sakshi News home page

Abhay Deol: ఆ డైరెక్టర్స్‌ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకుంటారు..

May 7 2022 4:46 PM | Updated on May 7 2022 6:24 PM

Abhay Deol Says He Feels Manipulated by Film Directors He Worked With - Sakshi

నేను అందరినీ సులువుగా నమ్ముతూ నిజాయితీగా ఉండి తప్పు చేశాను. ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్‌ ఎలా ఉంటారంటే.. మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వారు లైఫ్‌లో ముందుకెళ్లడానికి మనల్ని వాడుకుని వదిలేస్తారు.

'సోచానా తా' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు అభయ్‌ డియోల్‌. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పించిన ఈయన దాదాపు 20 సినిమాల్లో నటించాడు. అయితే నిజాయితీగా, పలువురికి ఆదర్శంగా ఉండాలనుకున్న తాను తర్వాత ఆ ఆలోచనే తప్పని తెలుసుకున్నానంటున్నాడు. తాజాగా మిడ్‌డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నిజాయితీ అనేది అంత మంచి పాలసీ ఏం కాదు. నాతో పని చేసిన దర్శకుల వల్ల నేను లాభపడ్డానని అంటున్నారని తెలిసింది. అందులో నిజమే లేదు. 

పైగా నేనునే అందరినీ సులువుగా నమ్ముతూ నిజాయితీగా మెదులుతూ తప్పు చేశాను. ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్‌ ఎలా ఉంటారంటే.. మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వారు లైఫ్‌లో ముందుకెళ్లడానికి మనల్ని వాడుకుని వదిలేస్తారు. నా జీవితంలోనూ అదే జరిగింది' అని చెప్పుకొచ్చాడు. కాగా అభయ్‌ చివరిసారిగా​ 'వెల్‌' అనే కామెడీ మూవీలో కనిపించాడు. అతడు నటించిన జంగిల్‌ క్రై మే 20న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు సాగర్‌ బల్లారి దర్శకత్వం వహించాడు.

చదవండి: ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్‌, సోషల్‌ మీడియాలో లేఖ వైరల్‌

సుమకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. . వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement