-
అది చూసి అడల్ట్ స్టార్ అన్నారు: హీరో పోస్ట్ వైరల్!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ డియోల్ 'సోచా న తా' అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అయేషా టాకియా, అపూర్వ జా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా 2005లో రిలీజైంది. ఈ రోజుకు సినిమా విడుదలైన 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో అభయ్ డియోల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మీరు ఓ లుక్కేయండి. అభయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇప్పటికీ కూడా ఈ సినిమా నిన్ననే చేసినట్లు అనిపిస్తోంది. ఆ చిత్రంలో మేము చాలా అమాయకంగా కనిపించాం. ఎందుకంటే అది మాకు ఇంకా నేర్చుకునే సమయం. కానీ ఇప్పటికీ 19 ఏళ్ల తర్వాత కూడా సినిమాలు చేస్తున్నాను. నేను చేసిన సినిమాల ద్వారానే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నా. అంతే కానీ పీఆర్ టీమ్ ద్వారా నేను ఫేమ్ తెచ్చుకోలేదు. నేను ఎంచుకున్న సినిమాల్లో విజయాలు, వైఫల్యాలను స్వయంగా చూశా. నన్ను నేను అనుసరించడం చాలా విలువైన పాఠాలు నేర్పింది. నేను ఎప్పటికీ నాలాగే ఉంటా. ఎందుకంటే నేను ఈ రోజు వ్యక్తిని కాను. సినిమా కోసం నా సొంత స్టైలిస్ను పొందాలని కోరుకుంటా. కానీ కొందరు మాత్రం ఆ సినిమాలో నా సైడ్ బర్న్స్ (కణతలు) చూసి 1970ల్లో పోర్న్ స్టార్లా ఉన్నారంటూ కామెంట్ చేశారు' అని పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ సోచా న తా సూపర్ హిట్ మూవీ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Abhay Deol (@abhaydeol) -
ఆ డైరెక్టర్స్ వాడుకుని వదిలేస్తారు: బాలీవుడ్ నటుడు
'సోచానా తా' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు అభయ్ డియోల్. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పించిన ఈయన దాదాపు 20 సినిమాల్లో నటించాడు. అయితే నిజాయితీగా, పలువురికి ఆదర్శంగా ఉండాలనుకున్న తాను తర్వాత ఆ ఆలోచనే తప్పని తెలుసుకున్నానంటున్నాడు. తాజాగా మిడ్డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నిజాయితీ అనేది అంత మంచి పాలసీ ఏం కాదు. నాతో పని చేసిన దర్శకుల వల్ల నేను లాభపడ్డానని అంటున్నారని తెలిసింది. అందులో నిజమే లేదు. పైగా నేనునే అందరినీ సులువుగా నమ్ముతూ నిజాయితీగా మెదులుతూ తప్పు చేశాను. ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే.. మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వారు లైఫ్‌లో ముందుకెళ్లడానికి మనల్ని వాడుకుని వదిలేస్తారు. నా జీవితంలోనూ అదే జరిగింది' అని చెప్పుకొచ్చాడు. కాగా అభయ్ చివరిసారిగా 'వెల్' అనే కామెడీ మూవీలో కనిపించాడు. అతడు నటించిన జంగిల్ క్రై మే 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సాగర్ బల్లారి దర్శకత్వం వహించాడు. చదవండి: ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్, సోషల్ మీడియాలో లేఖ వైరల్ సుమకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. . వీడియో వైరల్ -
హృతిక్ రోషన్ చేసిన పనికి చస్తా అనుకున్న
ముంబై: షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్ చేసిన పనికి తన పై ప్రాణాలు పైనే పోయాయంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు అభయ్ డియోల్. కొన్ని క్షణాల పాటు మృత్యుదేవత నా కళ్ల ముందే కనిపించిందని, అయితే అదృష్టం బాగుండటంతో ప్రాణాలు దక్కాయంటూ జిందగి నామిలేంగే దొబారా సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. లోయలోకి కారు జోయా అక్తర్ దర్శకత్వంలో హృతిక రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్‌లు కలిసి నటించిన జిందగి నామిలేంగే దొబారా చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సంరద్భంగా అభయ్ ఆ నాటి విషయాలు చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగేప్పుడు హృతిక్ కారు డ్రైవ్ చేస్తుంటే తాను, ఫర్హాన్ అక్తర్ కారు వెనుకు సీట్లో కూర్చున్నామని.. అయితే ఏటవాలుగా ఉన్న ప్రాంతం ప్రయాణించేప్పుడు, సడన్‌గా కారును ఆపి హృతిక్‌రోషన్ బయటకు వెళ్లాడని చెప్పారు. అయితే ఆ సమయంలో కారు హ్యాండ్‌బ్రేక్ వేయడం హృతిక్ మరచిపోయాడని.. దాంతో కారు నెమ్మదిగా లోయలోకి వెళ్లడం ప్రారంభించిందన్నారు. వెంటనే అలెర్టయిన ఫర్హాన్ కారు దిగేందుకు రెడీగా అయ్యాడని, తనకేమో మెదడు మొద్దుబారిపోయి సీటులో అలానే కదలకుండా కూర్చున్నట్టు అభయ్ చెప్పాడు. బ్రేక్ వేసిన హృతిక్ కారులోయలో పడుతుందని.. ఇక తనకు చావు తప్పదని ఫిక్స్ అయిన టైంలో పొరపాటు గ్రహించిన హృతిక్, వెంటనే వెనక్కి వచ్చిబ్రేక్ వేయడంతో ఊపిరి పీల్చుకున్నట్టు ఆనాటి ఘటనను వివరించారు అభయ్. ప్రేక్షకులను రంజిప చేసే ప్రయత్నంలో కొన్ని సార్లు తమకు తెలియకుండానే రిస్క్‌లో పడుతుంటామని చెప్పాడు అభయ్ -
బాలీవుడ్‌కి బ్రోచేవారెవరురా
2019లో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ ఒకటి. శ్రీ విష్ణు, నివేదా «థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. అజయ్ దేవగణ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అభయ్ డియోల్, కరణ్ డియోల్ ఈ రీమేక్‌లోæ హీరోలు. దేవెన్ ముంజల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో రీమేక్ రైట్స్ తీసుకున్నారట అజయ్. ప్రస్తుతం కథను హిందీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు మారుస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నెపోటిజం: ఆ ఆవార్డును బైకాట్ చేశాను
ముంబై: ‘జిందగీ నా మీలేగే దోబారా’ సినిమా విడుదలయ్యాక అన్ని ఆవార్డు వేడుకల్లో తనని, ఫర్హాన్ అక్తర్‌ను లీడ్‌రోల్ నుంచి తగ్గించి హృతిక్ రోషన్‌ను ప్రతిపాదించారని నటుడు అభయ్ డియోల్ పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ పరిశ్రమలో బంధుప్రీతి(నెపోటిజం) ఎక్కువగా ఉందంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్బంగా సినీయర్ నటుడు అభయ్ డియోల్ కూడా పరిశ్రమలో నెపోటిమ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు) "జిందగి నా మిలేగి దోబారా, 2011లో విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎదుర్కొన్న చేదు అనుభవాలు ప్రస్తుతం పరిస్థితిలో జ్ఞాప్తికి తెస్తున్నాయి. ఎందుకంటే నేను, ఫర్హాన్ అక్తర్, హృతిక్ రోషన్లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేశాం. కానీ విడుదలైన అనంతరం దాదాపు అన్ని అవార్డు ఫంక్షన్లో నన్ను, ఫర్హాన్‌ను ప్రధాన పాత్రల నుంచి తగ్గించి, సపోర్ట్ యాక్టర్స్ నామినేట్ చేశారు. ఈ సినిమాలో హృతిక్, కత్రినా ప్రధాన పాత్రల్లో ఉత్తమ నటులుగా ఆవార్డుకు ఎంపికయ్యారు. ఇది ఒక పురుషుడు, స్త్రీ ప్రేమలో పడే చిత్రం. అతను తీసుకునే ఏ నిర్ణయాలకైనా అతడి స్నేహితులు మద్దతు ఇస్తారు. దీని ప్రకారం వారిని ప్రధాన పాత్రలుగా ఎంపిక చేశారు. అంటే పరిశ్రమలో మిమ్మల్ని తగ్గించడానికి ఎన్నో రహస్య లేదా బహిరంగ మార్గాలు ఉంటాయి. మోసపూరితమైన ఈ ఆవార్డును నేను తిరస్కరించాను. కానీ ఫర్హాన్ మాత్రం సరే అన్నాడు. #familyfareawards’ అంటూ అభయ్ రాసుకొచ్చాడు. (సంగీత పరిశ్రమలో పెద్ద మాఫియా ఉంది) View this post on Instagram “Zindagi Na Milegi Dobara”, released in 2011. Need to chant this title to myself everyday nowadays! Also a great watch when anxious or stressed. I would like to mention that almost all the award functions demoted me and Farhan from main leads, and nominated us as “supporting actors”. Hrithik and Katrina were nominated as “actors in a leading role”. So by the industry’s own logic, this was a film about a man and a woman falling in love, with the man supported by his friends for whatever decisions he takes. There are many covert and overt ways in which people in the industry lobby against you. In this case it was shamelessly overt. I of course boycotted the awards but Farhan was ok with it. #familyfareawards Very creative artwork @kalakkii A post shared by Abhay Deol (@abhaydeol) on Jun 19, 2020 at 3:15am PDT అంతేగాక ఇటీవల దర్శకుడు అభినవ్ కశ్యప్ హీరో సల్మాన్ ఖాన్ అతని సోదరుడు ఇప్పటికే బాలీవుడ్లో అర్భాజ్ ఖాన్లు తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇక పరిశ్రమలో రాజకీయాలు ఎలా ఉంటాయో చెబుతు హీరోయిన్ రవీణ టాండన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా హీరో సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆదివారం(జూన్ 14)న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడిని 7 సినిమాలను నుంచి తొలగించడం.. అతడి సినిమాల విడుదలను నిలిపివేయడంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది బాలీవుడ్ ప్రముఖులపై బీహార్ కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్యసంకేతాలు..
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
వాహనాల తనిఖీ
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
శిల్ప సంపద అద్భుతం
పోలింగ్ సమయం గంట పెంపు
గ్రామాల్లో హోం ఓటింగ్
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement