అభిప్రాయం
పేదరికం అత్యంత బాధాక రమైనది. ప్రపంచంలో అత్యధి కులు పేదవారే. వారిని పేద రికం నుండి బయట పడేయ గలదీ, అభివృద్ధి వైపు నడప గలిగేదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే. దీనిని అర్థం చేసుకొన్నారు కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు. ఇప్పుడు మరోమారు ప్రజా సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల బరిలో దిగారు. పలు పబ్లిక్ మీటింగులూ, సుదీర్ఘ రాజకీయ యాత్రలతో విజయం వైపు నడుస్తున్నారు.
ఇక ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మాత్రం అభద్రతా భావంతో ఎన్నికల్లో నానా తిప్పలు పడుతున్నారు. చెప్పుకోవడానికి ప్రజలకు తాను చేసింది ఏమీ లేదు కాబట్టి జగన్ ప్రభుత్వంపై దుష్ప్ర చారాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. జనసేన – బీజేపీ నాయకులూ, ఆ యా పార్టీల పరిస్థితీ కూడా ఇదే. అందుకే, టీడీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా మరలా ఓడిపోవడం తథ్యం.
పెన్షనర్లలో 90 శాతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతున్న 40–60 ఏళ్ల వయస్సు స్త్రీలలో 90 శాతం, డ్వాక్రా మహిళల్లో 80 శాతం, మొత్తంగా స్త్రీలలో 90 శాతం వైఎస్సార్‌సీపీకే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్‌లు, ముస్లింలు, రెడ్లు, బ్రాహ్మణులు, అత్యధిక మంది బీసీలు వైఎస్సార్‌సీపీకే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కొంతమంది మధ్యతరగతి అర్బన్ ఓటర్లు మాత్రమే టీడీపీ కూటమికి ఓట్లు వేస్తారని అంటున్నారు. కాంగ్రెస్‌కు గతం కంటే అర శాతం మాత్రమే ఓట్లు పెరగవవచ్చు.
అయోధ్యలో గుడి నిర్మాణం, కొన్ని జాతీయ రహదారులను నిర్మించడం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏపీకి సంబంధించి... ఏపీకి స్పెషల్ స్టేటస్, రాయలసీమ – ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, పోల వరానికి ని«ధులు వంటి అనేక వాగ్దానాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు. ఇదీ బీజేపీ క్రెడిబిలిటీ!
జVýæన్ మాత్రం పేదల ముఖ్య అవసరాల్ని తీరుస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు. పేదల కొనుగోలు శక్తిని కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా పెంచగలిగారు. అందుకే 2019లో 12 శాతం ఉన్న పేదరికం 2024 నాటికి దాదాపు 4 శాతానికి తగ్గిపోయింది. జీఎస్టీ చెల్లింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు జగన్. జగన్ ప్రభుత్వం పేదలకు డీబీటీ కింద రూ. 2,70,000 కోట్లను, నాన్–డీబీటీ కింద ఇండ్లు, స్థలాలు వంటి రూపాల్లో రూ. 1,00,000 కోట్లకు పైగా ఇచ్చారు. మొత్తంగా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం.
అంతేగాక పాలనా వ్యవస్థలో, సంక్షేమ సేవల్లో, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచేట్లు చేశారు వైఎస్ జగన్. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, ఆరోగ్య శ్రీకి రూ. 25 లక్షల వరకూ ప్రభుత్వ సాయాన్ని పెంచడం, వృద్ధాప్య పింఛన్‌ను రూ. 3 వేల వరకు పెంచడం, స్త్రీ సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం; రాజకీయాల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లోనూ... మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం; వలంటీర్ వ్యవస్థ, రైతుభరోసా, ఉచిత పంటల భీమా, ఆక్వా రైతులకు తక్కువ ధరకు విద్యుత్, అమూల్ ద్వారా ఎక్కువ పాల ధర ఇవ్వడం, భూముల సర్వే, భూపట్టాల ధ్రువీకరణ, నాడు – నేడుతో పాఠశాలల రూపు మార్చడం, ఇంగ్లీష్ మీడియం విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యా కానుక... ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మనసులను జగన్ దోచుకున్నారు.
మరి చంద్రబాబు ఇలాంటి వేటినీ చేపట్టలేదు. ఇలాంటివి ఏ ఒక్కటీ చేశానని ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ప్రతి ఎన్నికలప్పుడూ పలు పథకాల్ని ప్రకటించడం, ఎన్నికలు అయిపోయాక వాటి అమలు మరచిపోవడం చేసేవారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల విషయంలో మాట్లాడ కూడని మాటలు మాట్లాడేవారు. అందుకే ఆయన జనంతో సంబంధాల్ని మానసికంగా కోల్పోయారు.
రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయక పోవడం, పొదుపు సంఘాలకు రుణమాఫీ అమలు పరచక పోవడం, కొత్తగా జన్మించిన ఆడబిడ్డకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఇస్తానన్న డబ్బు ఇవ్వక పోవడం, ఇంటింటికీ ఒక ఉద్యోగం – ఉద్యోగం ఇవ్వలేకుంటే నెలకు రూ. 2 వేలు ఇస్తానని ఇవ్వక పోవడం; పేదలకు మూడు సెంట్ల నేల, ఇల్లు, బీసీలకు సబ్ ప్లాన్, స్త్రీ రక్షణ ఫోర్స్ ఏర్పాటు, పసుపు–కుంకుమ పథకం లాంటి వాటిని అమలు చేయకుండా జనాన్ని మోసగించారు. విద్యను, వైద్యాన్ని వ్యాపారీకరణ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వైఫల్యాలు ఎన్నో!
బాబు ఘోర వైఫల్యం చెందిన అనంతరం పరి పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు చేశారు. అందుకే తాను ఏదైనా మేలు చేశానని నమ్మితేనే తనకు ఓటు వేయమని ఆయన ధైర్యంగా ప్రజలను అడుగు తున్నారు.
ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
వ్యాసకర్త ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర శాఖ
విశ్రాంత ఆచార్యులు ‘ 98495 84324
Comments
Please login to add a commentAdd a comment