బాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ డియోల్ 'సోచా న తా' అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అయేషా టాకియా, అపూర్వ జా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా 2005లో రిలీజైంది. ఈ రోజుకు సినిమా విడుదలైన 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో అభయ్ డియోల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మీరు ఓ లుక్కేయండి.
అభయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇప్పటికీ కూడా ఈ సినిమా నిన్ననే చేసినట్లు అనిపిస్తోంది. ఆ చిత్రంలో మేము చాలా అమాయకంగా కనిపించాం. ఎందుకంటే అది మాకు ఇంకా నేర్చుకునే సమయం. కానీ ఇప్పటికీ 19 ఏళ్ల తర్వాత కూడా సినిమాలు చేస్తున్నాను. నేను చేసిన సినిమాల ద్వారానే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నా. అంతే కానీ పీఆర్ టీమ్ ద్వారా నేను ఫేమ్ తెచ్చుకోలేదు. నేను ఎంచుకున్న సినిమాల్లో విజయాలు, వైఫల్యాలను స్వయంగా చూశా. నన్ను నేను అనుసరించడం చాలా విలువైన పాఠాలు నేర్పింది. నేను ఎప్పటికీ నాలాగే ఉంటా. ఎందుకంటే నేను ఈ రోజు వ్యక్తిని కాను. సినిమా కోసం నా సొంత స్టైలిస్‌ను పొందాలని కోరుకుంటా. కానీ కొందరు మాత్రం ఆ సినిమాలో నా సైడ్ బర్న్స్ (కణతలు) చూసి 1970ల్లో పోర్న్ స్టార్‌లా ఉన్నారంటూ కామెంట్ చేశారు' అని పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ సోచా న తా సూపర్ హిట్ మూవీ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment