అభయ్ డియోల్, కరణ్ డియోల్
2019లో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ ఒకటి. శ్రీ విష్ణు, నివేదా «థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. క్రైమ్ కామెడీ జానర్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. అజయ్ దేవగణ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అభయ్ డియోల్, కరణ్ డియోల్ ఈ రీమేక్‌లోæ హీరోలు. దేవెన్ ముంజల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో రీమేక్ రైట్స్ తీసుకున్నారట అజయ్. ప్రస్తుతం కథను హిందీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు మారుస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment