
Bigg Boss Telugu 5, Rahul Supports Sunny!: బిగ్‌బాస్ షో ముగింపు చేరుకుంటోంది. ఎవరు విన్నర్ అవుతారు? ఎవరు రన్నర్ అవుతారు? అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ షోపై స్పందించని సెలబ్రిటీలు కూడా ఇప్పుడిప్పుడే తమ అభిమాన కంటెస్టెంట్లకు మద్దతు తెలుపుతున్నారు. బిగ్‌బాస్ షో తర్వాత కనిపించకుండా పోయిన తమన్నా సింహాద్రి తాజాగా ప్రియాంక సింగ్‌కు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.
ప్రియ హౌస్‌లో ఉన్నంతవరకు ఆమెకు మద్దతు తెలిపిన అఖిల్ సార్థక్ ఇప్పుడు శ్రీరామచంద్రకు అండగా నిలిచాడు. షో చూసి ఎంజాయ్ చేస్తున్నా, కానీ ఎవరికీ సపోర్ట్ చేయనన్న బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు మాట మార్చాడు. సన్నీకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. సన్నీ గేమ్‌కు ఫిదా అయినట్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వార్ వన్‌సైడ్ అయిందంటూ హార్ట్ సింబల్ షేర్ చేశాడు. సగటు ప్రేక్షకుడిగా నా అభిప్రాయాన్ని సోషల్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశాను. నన్ను ఫాలో అయ్యేవారిలో ఏ ఒక్కరిని కూడా నేను ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం లేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment