
Bigg Boss Telugu 5 Winner: VJ Sunny is the Title Winner of Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. మోస్ట్ ఎంటర్‌టైనర్ సన్నీ బిగ్‌బాస్ విజేతగా అవతరించాడు. తనే విన్నర్ అని చెప్పగానే సంతోషంతో నాగార్జునను ఎత్తుకున్నాడు. ఇక తాను పడ్డ వంద రోజుల కష్టమంతా ట్రోఫీ అందుకోగానే మటుమాయమైపోయింది. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని అతడి తల్లి భావోద్వేగానికి లోనైంది. ఇక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గెలుపుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. తనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పెద్ద మొత్తంలో ఓట్లు సాధించినప్పటికీ సన్నీని దాటలేకపోయాడు. దీంతో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
విజేతగా అవతరించిన సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడని ప్రకటించాడు.
గెలిచామా? లేదా అన్నది కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యం అని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా గెలవచ్చాన్నాడు. తర్వాత విన్నర్ స్పీచిచ్చాడు సన్నీ. ఈ సందర్భంగా నన్ను గెలిపించిన ఆడియన్స్‌ను ఎప్పటికీ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటానని మాటిచ్చాడు. మనమెంత కొట్టుకున్నా సరే హౌస్‌మేట్స్ అందరం కలిసే ఉందామన్నాడు సన్నీ. అమ్మ అడిగిన మొట్టమొదటి బహుమతి బిగ్‌బాస్ ట్రోఫీ అంటూ దాన్ని ఆమె చేతుల్లో పెట్టి సంతృప్తి చెందాడు. తర్వాత షణ్ను గురించి మాట్లాడుతూ.. షణ్ను, సిరికి అంతమంచి ఫ్రెండ్‌షిప్ దొరకడం అదృష్టమని, తనకూ మానస్‌కూ మధ్య అలాంటి ఫ్రెండ్‌షిప్పే ఉందన్నాడు. నువ్వు చాలామంది మనసులు గెలుచుకున్నావ్ షణ్నూ అంటూ అతడిపై పొగడ్తలు కురిపించాడు.
మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. విన్నర్‌కు ప్లాట్ ఇచ్చిన సువర్ణ కుటీర్ డెవలపర్స్ రన్నరప్ షణ్నుకు కూడా ఎంతో కొంత ప్లాట్ ఇస్తామని ముందుకు రావడం విశేషం. ఇక ఐదో సీజన్‌కు గుడ్‌బై చెప్పిన నాగ్.. మరో రెండు నెలల తర్వాత కొత్త సీజన్ మొదలవుతుందని హింటిచ్చాడు. అది బిగ్‌బాస్ ఐదవ సీజనా? లేదా బిగ్‌బాస్ ఓటీటీనా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment