All Bigg Boss Telugu Seasons Winners: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షోకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో పేరు తెచ్చుకున్న బిగ్‌బాస్ హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తొలుత హాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఆ తర్వాత బాలీవుడ్‌కు అనంతరం కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ, తెలుగులోకి అడుగుపెట్టింది. అన్ని భాషల్లో ఈ షో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏ భాషలో అయిన బిగ్‌బాస్ షో వచ్చిందంటే అప్పటి వరకు ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న టీవీ షోలు, సీరియల్స్ వెనుకంజ వేయాల్సిందే. అంతగా టీఆర్‌పీ రెటింగ్స్‌ను కొల్లగొడుతూ బిగ్‌బాస్ అన్ని భాషల్లో దూసుకుపోతుంది.
చదవండి: ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్, ఎట్టకేలకు స్పందించిన సమంత
ఇదిలా ఉంటే తాజాగా తెలుగు బిగ్‌బాస్ 5వ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే మిగతా సీజన్స్ కంటే ఈ సీజన్ కాస్తా టీఆర్‌పీ వెనకంజలో ఉన్నప్పటికీ అట్టహాసంగా ఈ సీజన్‌కు గ్రాండ్ ఫినాలేతో గుడ్‌బాయ్ చెప్పారు నిర్వాహకులు. ఈ సీజన్‌లో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం చేసుకోగా ప్రముఖ యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ రన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మిగతా బిగ్‌బాస్ సీజన్ల విన్నర్స్ వారి పారితోషికం, గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో పలువరు సెర్చక్ష్ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి సీజన్ నుంచి 5వ సీజన్ వరకు విన్నర్లు, రన్నర్స్ వారి ప్రైజ్‌మనీకి సంబంధించి ఆసక్తికర విశేషాలు మరోసారి మీ కోసం...
బిగ్‌బాస్ సీజన్ 1 తెలుగు
తొలిసారిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ బిగ్‌బాస్ తొలి సీజన్ 2017లో ప్రారంభమైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌తో 70 రోజుల పాటు జరిగిన బిగ్‌బాస్ తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత వ్యవహరించాడు. 2017 జులై 16న ప్రారంభమైన ఈ షో 2017 డిసెంబర్ 24న పూర్తయింది. ఇందులో టాలీవుడ్ యాక్టర్ శివ బాలాజీ విన్నర్‌గా నిలిచి టైటిల్‌ను గెలుచుకొగా రన్నర్ అప్‌గా ఆదర్శ్ బాలకృష్ణ నిలిచాడు. విన్నర్‌గా గెలిచిన శివ బాలాజీ రూ. 50 లక్షలను సొంతం చేసుకోగా, పూర్తి ఎపోసోడ్‌లకు 8 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజనల్ సెకండ్ రన్నరప్‌గా నటి హరితేజ, మూడో రన్నరప్‌గా నవదీప్, నాలుగో రన్నరప్ ఆచార్య శాస్త్రీలు ఉన్నారు.
చదవండి: బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్.. పట్టేసిన నెటిజన్లు, ఫొటోలు వైరల్
బిగ్‌బాస్ సీజన్ 2 తెలుగు
నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు 2వ సీజన్‌లో మోడల్, నటుడు కౌశల్ మండ విన్నర్‌గా నిలిచాడు. 2018 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 112 రోజుల పాటు జరిగిన ఈ సీజన్‌లో 15 మంది సెలబ్రెటీలు రాగా ముగ్గురు సాధారణ వ్యక్తులు కంటెస్టెంట్‌గా వచ్చారు. 2018 సెప్టెంబర్ 30న జరిగిన ఫైనల్‌లో కౌశల్ మండ ఫైనల్‌గా నిలిచి రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. ఈ సీజనల్ హౌజ్‌లో ఎన్నో విమర్శలు, వివాదాలను ఎదుర్కొ అతడు హౌజ్ బయటక ఆర్మినే సంపాదించుకున్నాడు. ఈ సీజన్‌లో సింగర్ గీతా మాధురి రన్నరప్‌గా నిలిచింది. సెకండ్ రన్నరప్ తనిష్ అల్లాడి ఆతర్వాత దీప్తి నల్లమోతు, సమ్రాట్ రెడ్డిలు ఉన్నారు.
బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు
తొలిసారి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు మూడవ సీజన్‌లో ర్యాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా నిలిచాడు. 2019 జులై 21 ఆరంభమై 2019 నవంబర్ 3 వరకు జరిగిన ఈ సీజనల్ మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ 105 రోజులకు వరకు అలరించారు. ఈ సీజన్ ఫైనల్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా నిలిచి రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకోగా ప్రముఖు బుల్లితెర యాంకర్ శ్రీముఖి రన్నర్ అప్‌గా నిలిచింది. రెండవ రన్నరప్‌గా బాబా భాస్కర్, ఆ తర్వాత వరుణ్ సందేశ్, అలీ రేజాలు ఉన్నారు.
బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు
నటుడు అబిజిత్ విన్నర్‌గా నిలిచిన ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 2020 సెప్టెంబర్ 6న స్టార్ట్ అయిన ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ 2020 డిసెంబర్ 20న గ్రాండ్ ఫైనాలేను జరుపుకుంది. ఈ సీజన్‌కు అభిజిత్ విన్నర్‌గా నిలవగా అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్‌గా అభిజిత్ రూ. 25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకోగా, ఓ బైక్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక మొత్తం 106 రోజులకు 60 లక్షలు పారితోషికం అందుకున్నాడు. మూడో రన్నరప్ సయ్యద్ సోహైల్ రూ. 20 లక్షలు తీసుకున్నాడు. మూడవ రన్నర్‌గా అరియాన గ్లోరీ, ఆ తర్వాత స్థానంలో అలేఖ్య హారిక ఉంది.
బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు
నటుడు, యాంకర్ వీజే సన్నీ విజేతగా నిలిచిన ఈ సీజన్‌కు నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించాడు. 2021 సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమైన ఈ షోలో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ 106 రోజుల పాటు వినోదం అందించారు. 2021 డిసెంబర్ 19 గ్రాండ్ ఫినాలే జరపుకున్న ఈ సీజన్ విన్నర్‌గా సన్నీ నిలవగా రన్నర్‌గా షణ్ముక్ జశ్వంత్ ఉన్నాడు. ఆ తర్వాత శ్రీరామ్ చంద్ర, మానస్, సిరి హన్మంత్‌లు ఉన్నారు. ఈ సీజన్ విన్నర్ సన్నీ రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ఓ బైక్, రూ. 25 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను గెలుచుకున్నాడు. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా వారానికి రెండు లక్షల చొప్పున 15 వారాలకు రూ.30 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నాడట సన్నీ.
Comments
Please login to add a commentAdd a comment