Reasons Behind Vj Sunny Success In Bigg Boss 5 Telugu - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu Winner: ఆ పదం, ఆ సింబల్‌.. సన్నీ విజయంలో కీలకం

Published Tue, Dec 21 2021 4:28 PM | Last Updated on Tue, Dec 21 2021 5:30 PM

Bigg Boss 5 Telugu: Reason behind Skinny Success - Sakshi

Bigg Boss 5 Winner Sunny Success Reasons: బిగ్ బాస్ సీజన్ 5 ఘనంగా ముగిసింది. అందరూ ఊహించిన విధంగానే సన్ని సీజన్ 5 విన్నర్ గా నిలిచాడు. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు, 25 లక్షలు విలువజేసే స్థలాన్ని సైతం అందుకున్నాడు.

మొదట వీడియో జాకీ ఆ తర్వాత యాంకర్,  సీరియల్ లో కూడా నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ 5 విన్నర్ అయ్యాడు. త్వరలో సకల గుణాభిరామా సినిమాతో బిగ్ స్క్రీన్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తంగా సన్ని సాగిస్తున్న జర్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ఫస్ట్ డే నుంచే తనదైన ఆటతో, అందరి మనసుల్ని గెలుచుకుంటూ ఎన్నో ఎలిమినేషన్ రౌండ్స్ దాటుకుంటూ చివరకు బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు.

బిగ్ బాస్ విజేతగా నిలిచేందుకు సన్ని చాలా కష్టపడ్డాడు.ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చే టాక్స్ లను చాలా సీరియస్ గా తీసుకునేవాడు. గేమ్స్ లో పీక్స్ లో అగ్రెసివ్ గా కనిపించేవాడు.కొన్ని సార్లు మిగితా కంటెస్టెంట్స్ తో గొడవ పడేవాడు. అయితే టాస్క్ ఏదైనా సరే సన్ని మాత్రం తనదైన ముద్ర వేసేవాడు. అందరి దృష్టిని ఆకర్షించేవాడు.

వివిధ టాస్క్ లలో భాగం సన్నిని మిగితా కంటెస్టెంట్స్ ఎన్నో సార్లు కార్నర్ చేశారు. కాంట్రవర్సీ ఇష్యూస్ లోకి అతన్ని లాగారు. కానీ ప్రతీసారి సన్ని నిర్దోషిగా నిలిచాడు. బిగ్ బాస్ ఆడియెన్స్  తో పాటు బిగ్ బాస్  మనసును గెల్చుకున్నాడు. హౌస్ లో సరదాగా ఉంటూ, అందరి ముఖాల్లో నవ్వు తెప్పిస్తూ అప్నా టైమ్ ఆయేగా అంటూ ఒక్కో ఎలిమినేషన్ ను దాటుకుంటూ వచ్చాడు సన్ని.

ఎప్పుడూ కూల్ గా టోపీతో కనిపించడం, అందర్నీ మచ్చా అని పిలవడం, థ్యాంక్స్ చెప్పేందుకు లవ్ సింబల్ ను వాడటం సన్నికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇక హౌస్ లో మానస్ తో స్నేహం, సిస్టర్ కాజల్ తో బాండింగ్‌ అతనికి అదనపు బలాన్ని అందించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement