Bigg Boss 5 Winner Sunny Emotional Comments About His Father: బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా వీజే సన్నీ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తల్లి కళావతి గురించి ఎప్పుడూ చెప్పే సన్నీ.. తండ్రి గురించి ఇంతవరకు ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కొన్ని ఎలా జరుగుతాయో మనకి తెలియదు. అలాంటి సందర్భం ముందు ముందు రాకూడదని అనుకుంటున్నా. అమ్మానాన్న వెరీ గుడ్.
'నేను అమ్మతో ఉంటాను. నాన్నంటే కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా. వాళ్ల మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ విషయం గురించి అమ్మని ఎప్పుడూ అడగలేదు. అది వాళ్ల పర్సనల్ మ్యాటర్. నాకు కళావతి అనే మంచి ఫ్రెండ్ ఉంది' అంటూ చెప్పుకొచ్చారు.
కాగా సన్నీకి ఏడాది వయసున్నప్పుడే పేరెంట్స్ విడిపోవడంతో తండ్రి ప్రేమకు దూరమైన సన్నీకి అప్పటి నుంచి తల్లి అన్నీ తానై చూసుకుంది. అంతేకాకుండా ఆమె తనకు మొదటి సారి అడిగిన గిఫ్ట్ బిగ్‌బాస్ విజయం అని, కప్పు గెలిచిన రోజు ఓ కొడుకుగా ఆమె ఆనందం చూసి ముచ్చటేసిందని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment