
Bigg Boss 5 VJ Sunny Experience With Star Hero: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విజయవంతంగా ప్రసారమవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారమైతే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్‌లలో ఒకరు విజేతగా నిలుస్తారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పోటీ షణ్ను, సన్నీల మధ్యే ఉంటుందని మెజారిటీ నెటిజన్లు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే షణ్ను, సన్నీ ఇద్దరూ వేర్వేరు స్వభావం కలవారు. షణ్ను సైలెంట్ అయితే సన్నీ వయొలెంట్.. అతడు మైండ్ గేమ్‌లో ఎక్స్‌పర్ట్ అయితే సన్నీ ఫిజికల్ గేమ్‌లో ఎక్స్‌పర్ట్. ఇలా ఒక్కొక్కరు ఒక్కోదాంట్లో ముందున్నారు. షణ్ముఖ్ ఫేవరెట్ హీరో సూర్య అని మనందరికీ తెలుసు. మరి సన్నీ ఫేవరెట్ ఎవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట!
'షారుక్ ఖాన్‌ను వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టపడతాను. జర్నలిస్టుగా ఉన్నప్పుడే ఆయనను కలిశాను. ఒక స్టార్ అన్న ఫీలింగ్ లేకుండా అందరితో కలిసిపోతారు. డాన్ 2 ప్రమోషన్స్ నేను వెనకుండి నడిపించాను. ఆ విషయం ఆయనకు కూడా తెలీదు. ఉదయం నుంచి ఆయన వెనకాలే ఉన్నా.. ఆరోజు ఆయన వెళ్లిపోతుంటే భాయ్.. ఏక్ ఫొటో అని గట్టిగా అడిగా.. అంత జనంలోనూ ఆయన వెనక్కు వచ్చి నవ్వుతూ నాతో ఫొటో దిగారు. అది జీవితంలో మర్చిపోలేను' అని చెప్పుకొచ్చాడు సన్నీ.
Comments
Please login to add a commentAdd a comment