Bigg Boss 5 Telugu Winner VJ Sunny Got Current Shock in Press Meet - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Winner VJ Sunny: ప్రెస్‌మీట్‌లో సన్నీకి కరెంట్‌ షాక్‌

Published Tue, Dec 21 2021 6:21 PM | Last Updated on Tue, Dec 21 2021 7:03 PM

Bigg Boss 5 Telugu Winner VJ Sunny Got Current Shock in Press Meet - Sakshi

 బిగ్‌బాస్‌ సీజన్‌-5 ముగిసింది. ఈ సీజన్‌ విన్నర్‌గా సన్నీ నిలిచాడు. తనదైన ఆట తీరుతో మెప్పింపిన సన్నీ, బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గానూ ఎంతోమంది మనసుల్ని గెలుచుకున్నాడు. ఇక బిగ్‌బాస్‌ టైటిట్‌ గెలిచిన అనంతరం వరుస ఇంటర్వ్యూలతో యమ బిజీగా గడిపేస్తున్నాడు సన్నీ. అయితే తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనుకోని పరిణామం ఎదురైంది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రెస్‌మీట్‌లో పలు మీడియా చానెల్స్‌తో పాటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్‌లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్‌ షాక్‌ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఘటనలో ఎవరికి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement