VJ Sunny Sakala Gunabhi Rama Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Sakala Gunabhi Rama: ఈ శుక్రవారం సన్నిదే .. యాంకర్‌ రవి

Published Tue, Sep 13 2022 4:50 PM | Last Updated on Tue, Sep 13 2022 5:43 PM

VJ Sunny Sakala Gunabhi Rama Movie To Release On 16th September - Sakshi

‘సినిమా వాళ్లు ఏదో ఒక శుక్రవారం మాది కావాలని కోరుకుంటారు. ఈ శుక్రవారం మాత్రం మా సన్నిదే. సకల గుణాభి రామ చిత్రం నేను చూసాను, చాలా బాగుంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది’అని యాంకర్‌ రవి అన్నారు. బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16 న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్ బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్‌ రవి మాట్లాడుతూ.. ఈ చిత్రానికి  మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. పాటలు చాలా బాగున్నాయి. సన్నీ కి ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని కోరుకున్నారు. 

సోహైల్ మాట్లాడుతూ ..మేమంతా బిగ్ బాస్ తర్వాత ఫేమస్ అయ్యాము కానీ మా అందరి గోల్ మాత్రం సినిమాల్లో నటించడమే. మేము అందరం చాలా కష్టపడి మా కెరీర్ ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులు అందరూ ఈ చిత్రం చూడండి. ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతం అయితే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకు వస్తాయి. అందరూ మా సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రాన్ని చూసి విజయవంతం చేయండి’ అని కోరుకున్నారు.  ‘లాక్ డౌన్ టైం లో చిన్న సినిమా గా ప్రారంభం అయిన సకల గుణాభి రామ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కొత్త టెక్నిషన్స్ చాలా కష్టపడి పని చేసాం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది’అని దర్శకుడు శ్రీనివాస్‌ వెలిగండ అన్నారు. 

హీరో సన్నీ మాట్లాడుతూ .. నేను బిగ్ బాస్ లో రాక ముందే నాకు హీరో గా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్ గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు.  మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేసాం, ప్రేక్షకులు అందరూ మా సినిమా ని చూసి హిట్ చేస్తారు’ అని కోరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement