బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విజే సన్నీ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు. వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా 'సౌండ్ పార్టీ' అనే సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీలో గట్టిగానే సౌండ్ చేస్తుంది. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా సౌండ్ పార్టీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయ శంకర్ సమర్పణలో విడుదలవుతున్న ఈ మూవీకి సంజయ్ శేరి దర్శకుడు.
(ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి)
హ్రితిక శ్రీనివాస్- విజే సన్నీ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఓ పాటను తాజాగా ఒక పాటను మేకర్స్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో వైరల్ అవుతోన్న ఈ సాంగ్ మంచి వ్యూస్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ తో హల్ చల్ చేస్తోంది. ఫస్ట్ లిరికల్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన 'సౌండ్ పార్టీ' చిత్రం ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్ లో రీ -సౌండ్ సృష్టించడం ఖాయం అనడంలో సందేహం లేదు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత రవి పోలిశెట్టి మాట్లాడుతూ... 'ఎప్పుడైతే మా 'సౌండ్ పార్టీ' చిత్రం టీజర్ విడుదలైందో అప్పటి నుంచి మా చిత్రానికి మంచి బజ్ వచ్చింది. ముఖ్యంగా టీజర్‌లో వీజే సన్నీ, శివన్నారాయణ చెప్పిన డైలాగ్స్ తో సినిమాలో ఎలాంటి హ్యుమర్ ఉండబోతుందో అర్థమవుతోంది. మా సంగీత దర్శకుడు మోహిత్ రెహమానిక్ అద్భుతమైన పాటలతో పాటు సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు చేశారు. అలాగే చిత్ర సమర్పకుడు జయ శంకర్ , దర్శకుడు సంజయ్ శేరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.' అని రవి పోలిశెట్టి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment