
Bigg Boss 5 Telugu: షోలో బాగా హైలైట్ అయిన సంఘటనలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు బిగ్‌బాస్. ఈ ఐకానిక్ సంఘటనలలో ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రియాంక సింగ్, యానీ మాస్టర్‌గా మానస్; షణ్ముఖ్‌గా సన్నీ; లోబో, కాజల్‌గా శ్రీరామ్; సన్నీగా సిరి.. ఇలా ప్రతి ఒక్కరు సమయానుసారంగా ఆయా పాత్రల్లో దూరిపోయి తెగ నవ్వించారు.
తాజాగా సన్నీ హమీదాలా మారిపోయాడు. హమీదా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన సన్నీ శ్రీరామ్ సరసన వాలిపోయాడు. మరోపక్క షణ్ను సిరితో మళ్లీ గొడవపడ్డాడు. 'నువ్వు ఎవరితోనైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతే నేను ఆపాను, నిన్నెవడో అప్పడం అంటే నీకోసం వాదించాను, మీ అమ్మ వచ్చి అందరి ముందు హగ్గుల గురించి మాట్లాడింది.. నేను నెగెటివ్ అవట్లేదు కానీ నేను నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను?! అవతలవాళ్ల ముందు నేను తక్కువైనా పర్లేదు కానీ నీ గురించి ఫైట్ చేస్తున్నాను.. అప్పుడూ నేను నెగెటివ్ అవలేదు? వెళ్లిపో, మిగతా హౌస్‌మేట్స్ ఎలాగో నువ్వూ అంతే, నా నెత్తి మీద ఎక్కకు.. వెళ్లిపో' అని తెగేసి చెప్పాడు షణ్ను. షణ్ను ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ అన్నీ తప్పుగా ఊహించుకుంటూ సిరికి చుక్కలు చూపిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment