
ఆప్నా టైం ఆయేగా అంటూ ఉండే సన్నీకి నిజంగానే తన టైం వచ్చేసింది. విజయతీరాలను ముద్దాడటం కోసం తీవ్రంగా కష్టపడ్డ అతడు చివరకు అనుకున్నది సాధించాడు.
Bigg Boss 5 Telugu Winner VJ Sunny Remuneration: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా ఖమ్మం కుర్రాడు వీజే సన్నీ చరిత్ర సృష్టించాడు. ఇతడు హౌస్‌లో వెనక్కు తిరిగి చూసుకుంటే కత్తిపోట్లు, వరస్ట్ పర్ఫామర్ ట్యాగులు, గిల్టీ బోర్డు, సిరితో గొడవలు, నాగార్జునతో చీవాట్లు.. ఇవే ప్రధానంగా కనిపిస్తాయి. కానీ అతడి అభిమానులకు మాత్రం అతడు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్, అమాయకత్వం, టాస్కులు గెలిచే ధీరుడిగానే ప్రముఖంగా కనిపిస్తాడు. తనకు మైనస్‌లుగా ఉన్నవాటిని ప్లస్‌లుగా మార్చుకుని గెలుపు తలుపు తట్టాడు సన్నీ. కల్మషం లేని మనసు, ఫ్రెండ్‌షిప్‌లో నిజాయితీ అతడిని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ఆప్నా టైం ఆయేగా అంటూ ఉండే సన్నీకి నిజంగానే తన టైం వచ్చేసింది. విజయతీరాలను ముద్దాడటం కోసం తీవ్రంగా కష్టపడ్డ అతడు చివరకు అనుకున్నది సాధించాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సన్నీ విన్నర్‌గా ఎలాగో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని సొంతం చేసుకున్నాడు. అలాగే టీవీఎస్ అపాచీ స్పోర్ట్స్ బైక్ కూడా గెలుచుకున్నాడు. వీటితో పాటు అతడు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది. తనకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ టీం సన్నీకి వారానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చారట! అంటే 15 వారాల్లో రూ.30 లక్షలు సంపాదించాడు.