
Bigg Boss 5 Telug Winner Sunny Exclusive Interview: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ విజయానందంలో తేలియాడుతున్నాడు. ఏ క్షణమైతే తన తల్లి ట్రోఫీ తీసుకురావాలని చెప్పిందో అప్పుడే కప్పు తనదేనని ఫిక్సయ్యాడు. చివరికి అమ్మ కలను నిజం చేస్తూ బిగ్‌బాస్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. షో నుంచి విన్నర్‌గా బయటకు వచ్చిన అనంతరం అతడు అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా తన సంతోషాన్ని అరియానాతో పంచుకున్న సన్నీ హౌస్‌లో తను బాధపడ్డ క్షణాలను, హౌస్‌మేట్స్ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. 'నేను చేయని తప్పుకు రెండుమూడుసార్లు నింద పడ్డాను. కానీ ఆ బాధతో వెనక్కి తగ్గకుండా టాస్కుల్లో మరింత గట్టిగా ఫైట్ చేశాను. బేటన్ టాస్కులో చాలా కష్టపడ్డాను కానీ అందరూ నన్ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. నేను కెప్టెన్సీ కోసం నిలబడ్డప్పుడు అందరూ ఏవేవో సిల్లీ రీజన్స్ చెప్పి కత్తితో కసాకసా పొడిచేశారు. చాలా బాధేసింది. ఎందుకో తెలీదు కానీ హౌస్‌లో నేను వాళ్లకు నచ్చలేదు.
శ్రీరామ్ నామినేషన్స్‌లో ఒకలా ఉంటాడు, సాధారణసమయంలో ఇంకోలా ఉంటాడు. ఉమాదేవి.. సూర్యకాంతం.. బయటకు అరుస్తారు కానీ చాలా మంచావిడ. విశ్వ గేమ్ అంటే ప్రాణమిస్తాడు. నటరాజ్ మాస్టర్ హార్డ్ వర్కర్, అతడిని ముద్దుగా సింహం అని పిలుచుకుంటాం. సరయూను అర్థం చేసుకునే సమయంలోనే ఆమె వెళ్లిపోయింది. ప్రియాంక సింగ్ బంగారం, డాక్టర్ ప్రియాంక ఎవరు బాధపడినా తట్టుకోలేదు. పింకీలాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి. లహరి చాలా జెన్యూన్, యానీ మాస్టర్ స్వీట్, స్ట్రాంగ్ లేడీ. రవి ఫైటర్.
కాజల్ స్మార్ట్, స్ట్రయిట్ ఫార్వర్డ్. ఆమెకు నాగిని, స్ట్రాటజీ క్వీన్ అని చాలా స్టాంపులు వేశారు. శ్రీరామచంద్ర హౌస్‌లో లేకపోతే చాలా బోర్ అయ్యేది. ఆయన టాలీవుడ్‌లో మంచి బెస్ట్ సింగర్‌గా ఎదుగుతాడు. సిరి షణ్ముఖ్ ఫ్రెండ్‌షిప్ బాగుండేది. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు కేర్ తీసుకునేవారు. మానస్ నా డార్లింగ్, ఇద్దరం కుక్కపిల్లల్లా కొట్టుకుంటాం. అతడు నన్ను చాలా నడిపించాడు. అలాంటి ఫ్రెండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి. జెస్సీ చిన్నపిల్లోడు. మొదట్లో అందరూ టార్గెట్ చేశారు. లోబో మంచి వ్యక్తి, ఎంటర్‌టైనర్. ప్రియకు నాకు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. కానీ తర్వాత క్లోజ్ అయ్యాం. హమీదా ఫ్రెండ్లీ నేచర్, టాకెటివ్, టాలెంటెడ్. శ్వేత చాలా డిఫరెంట్. షణ్ను బ్రహ్మ బ్రెయిన్‌తో గేమ్ ఆడాడు. నిజానికి నాతో, మానస్‌తో పాటు కాజల్ లేదా శ్రీరామ్ టాప్ 3లో ఉంటారు అనుకున్నా. కానీ అది జరగలేదు' అని చెప్పుకొచ్చాడు సన్నీ.
Comments
Please login to add a commentAdd a comment