
ఇక ప్రియాంక.. తనకు మానస్ హీరో అని చెప్పగా అతడు కాకుండా వేరే పేరు చెప్పమని అడిగాడు నాగ్. నిన్ను ఎంత ఏడిపించినా అతడే హీరోనా? అని ప్రశ్నించగా అవునని తలూపుతూ సిగ్గుపడిపోయింది పింకీ.
ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. దాదాపు అందరూ తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. తాజాగా నాగార్జున వీరికి.. మీకు హౌస్‌లో ఎవరు హీరో? ఎవరు విలన్? అనే గేమ్ ఆడించారు. దీంతో యానీ.. కాజల్‌ను విలన్ అని తేల్చేసింది. ప్రియాంక, శ్రీరామ్.. సిరిని విలన్‌గా పేర్కొన్నట్లు కనిపిస్తోంది. ఇక రవి, షణ్ను ఇద్దరూ ఒకరికొకరు విలన్ ట్యాగ్ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా షణ్ను.. ఈ విలన్ లేకపోతే తాను హీరో అవలేనని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రియాంక.. తనకు మానస్ హీరో అని చెప్పగా అతడు కాకుండా వేరే పేరు చెప్పమని అడిగాడు నాగ్. నిన్ను ఎంత ఏడిపించినా అతడే హీరోనా? అని ప్రశ్నించగా అవునని తలూపుతూ సిగ్గుపడిపోయింది పింకీ. ఇక సిరి.. షణ్ను ఎప్పుడూ హీరోనే అంటూ అతడికి హీరో ట్యాగ్ ఇచ్చింది. దీంతో వీళ్ల ఫ్రెండ్‌షిప్‌ను చూసి సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. ఇక సన్నీకి ఎవరూ విలన్, హీరో ట్యాగ్ ఇవ్వకపోవడంతో తెగ బాధపడిపోయాడు. ఏదో ఒకటి ఇచ్చి చావచ్చు కదా అన్నాడు. దీంతో నాగ్.. సన్నీ విలన్‌కు, హీరోకు మధ్యలో ఉండే కమెడియన్ అని సెటైర్ వేశాడు.