చేతగాని వాళ్లలా ఆడకు, నా జోలికి వస్తే వదిలిపెట్ట: సన్నీ వార్నింగ్‌ | Bigg Boss Telugu 5 Promo: Sunny Fight With Priya In Captaincy Task | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: శ్రీరామ్‌కు క్లోజ్‌గా సిరి, ఓర్వలేకపోయిన షణ్ను

Published Tue, Oct 19 2021 5:43 PM | Last Updated on Tue, Oct 19 2021 5:57 PM

Bigg Boss Telugu 5 Promo: Sunny Fight With Priya In Captaincy Task - Sakshi

Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో సన్నీ, ప్రియకు అస్సలు పడదన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. వారిద్దరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! ప్రతివారం ఇద్దరూ ఒకరినొకరు నామినేట్‌ చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా కెప్టెన్సీ టాస్కులోనూ వీళ్లిద్దరూ టామ్‌ అండ్‌ జెర్రీలా కొట్టుకున్నారు. నేను ఎవ్వడి జోలికి వెళ్ల, నా జోలికి వస్తే వదిలిపెట్టను అని హెచ్చరించాడు సన్నీ.  'నేనందరి జోలికొస్త, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి' అంటూ పవన్‌ కల్యాణ్‌ స్టైల్‌లో సమాధానమిచ్చింది ప్రియ.

నా జోలికొస్తే ఊరుకోనని మరోసారి వార్నింగ్‌ ఇచ్చాడు సన్నీ. అయినా పట్టించుకోని ప్రియ.. దమ్ముంటే దోచుకోమని సవాలు విసిరింది. 'చేతగాని వాళ్లలాగా ఆడకు, కొంచెం మంచిగా ఆడు' అంటూ సన్నీ కౌంటరివ్వగా.. 'బొమ్మలు దొబ్బేసి నేను తీయలే అంటారు చేతగానోళ్లు' అని పరోక్షంగా అతడికే రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చిందీ నటి. చేతనయినోళ్లు దొంగతనం చేసి చెప్తారని చిటికేసి మరీ చెప్పింది. ఆమె తీరుతో చిర్రెత్తిపోయిన సన్నీ 'నా నిజ స్వరూపం చూపిస్తా' అని సమయం కోసం ఎదురు చూస్తుండగా 'మస్తు చూశేశిన..' అంటూ అతడిని కరివేపాకులా తీసిపారేసింది ప్రియ. ఇదంతా విన్న కాజల్‌.. మాటలు గుర్తుపెట్టుకో, వీకెండ్‌లో తీద్దాం అని సూచించింది. ఇక ప్రియ.. తన గుడ్డును మానస్‌కు ఇవ్వడం గమనార్హం.

ఇదిలావుంటే సరదాగా ఆడుకుంటున్న శ్రీరామ్‌, సిరిని చూసి ఓర్వలేకపోయాడు షణ్ముఖ్‌. వీళ్లిద్దరూ మళ్లీ మొదలెట్టారని అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంలో సిరితో మరోసారి వాదులాటకు దిగినట్లు కనిపిస్తోంది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో ఇప్పటివరకు మానస్‌, విశ్వ గెలిచినట్లు సమాచారం. మరి వీరితో పాటు ఎవరెవరు కెప్టెన్సీకి పోటీపడతారన్నది ఆసక్తికరంగా మారింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement