
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి నోట్ల కట్టలున్న బ్యాగును ఎత్తుకెళ్లిపోయాడు. తీరా కారు దగ్గరకు వెళ్లగానే బ్యాగు కిందపడటంతో అందులో ఉన్న డబ్బులు బయటపడ్డాయి. వెంటనే వాటిని ఆదరాబాదరాగా తిరిగి బ్యాగులో సర్దుకున్న సన్నీ ఎవరూ తనను చూడట్లేదని కన్ఫామ్ చేసుకుని వెంటనే అక్కడి నుంచి కారులో చెక్కేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఈ దొంగతనం నిజమా? అబద్ధమా? అని తల గోక్కుంటున్నారు.
అయితే ఇది కేవలం ప్రీప్లాన్‌డ్ డ్రామా అని తెలుస్తోంది. అవును, సన్నీ ప్రస్తుతం ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. సి.చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్‌కు హరీష్ శంకర్ కథ అందించారు. దిల్ రాజు బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగానే సన్నీ దొంగతనం చేశాడని స్పష్టమవుతోంది. లేకపోతే కారులో అంత స్టైలిష్‌గా వచ్చి దొంగతనం చేస్తారా? అంటున్నారు ఫ్యాన్స్.
చదవండి: సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ అద్దెకు, ఎన్ని లక్షలో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment