
Bigg Boss 5 Telugu, Trolling On Shiva Jyothi: కెప్టెన్సీ టాస్క్‌లో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే! సిరి, షణ్ను- సన్నీ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతున్నావ్ అన్న సన్నీ వ్యాఖ్యలను షణ్ను ప్రేయసి దీప్తి సునయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే! సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడినట్లా? అని మండిపడింది. మరి నీకు కాజల్ సపోర్ట్ చేసినప్పుడు ఏమైంది? అని ప్రశ్నించింది. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకో? అని సన్నీ హెచ్చరించడాన్ని సైతం తప్పుపట్టింది. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాడని సంతోషించకుండా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్పని హితవు పలికింది.
తాజాగా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి కూడా షణ్నూకు మద్దతుగా నిలబడింది. దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేస్తూ.. 'ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆడటం అంటే? ఒకసారి మీరు కెప్టెన్ అవడానికి యానీ మాస్టర్ సపోర్ట్ చేశారు. ఇది లేడీ కార్డ్ వాడటం కాదా? గుర్తు తెచ్చుకోండి. హౌస్ బయట కాదు, హౌస్ లోపల హెల్తీ గేమ్ ఆడండి, మీరు మీ ఫ్రెండ్స్‌తో గేమ్ ఆడొచ్చు, మీ ఫ్రెండ్ మిమ్మల్ని సేవ్ చేయకపోతే అలగొచ్చు, ఏంటో మరి..' అని సన్నీకి చురకలు అంటించింది.
అయితే సన్నీ ఫ్యాన్స్ శివజ్యోతి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'షణ్ను సిరి క్యారెక్టర్ గురించి మాట్లాడటంలో తప్పు లేదు, సిరి సన్నీ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయడంలో తప్పు లేదు, దీనికి షణ్ను సపోర్ట్ చేయడంలో అస్సలు తప్పు లేదు కదూ. మీరు కేవలం కొన్ని పాయింట్లే పట్టుకుని వేలాడకండి, అన్నింటి గురించి మాట్లాడండి. ఇలా పక్షపాతం చూపిస్తారనుకోలేదు, ఏంటో మరి' అని సెటైర్లు వేస్తున్నారు. షోని షోలాగే చూడండి, క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దు అని నీతులు చెప్తూ వీడియోలు పెట్టారు, మరిప్పుడు మీరు చేస్తుందేంటి? అని నిలదీస్తున్నారు. 'నువ్వు బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్నప్పుడు గేమే ఆడలేదు, ఊరికే ఏడ్వడం తప్ప! అలాంటిది మీరు గేమ్ గురించి మాట్లాడుతున్నారు' అని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే ఇంకోసారి సన్నీని ఏమైనా అంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment