
Bigg Boss Telugu 5, Sunny Supports Shannu: షణ్నుకు దగ్గరవుతున్నావు, కానీ అతడిని హగ్ చేసుకోవడమే నచ్చలేదు అని సిరి తల్లి బిగ్‌బాస్ హౌస్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో హౌస్‌మేట్స్ అందరూ షాకవగా షణ్ను అయితే తలెత్తుకోలేకపోయాడు. ఆమె అలా అంటుంటే సిరి దాన్ని ఆపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంత చేసి ఇలాంటి మాటలు పడాల్సి వచ్చిందేనని కుంగిపోయి ఏడ్చేశాడు.
అయితే ఇలాంటి సమయంలో సన్నీ అతడికి అండగా నిలిచాడు. వాళ్లది ఫ్రెండ్‌షిప్ అని నొక్కి చెప్పాడు. '82 రోజులుగా వాళ్లను చూస్తూనే ఉన్నాం. వాళ్లిద్దరిదీ చాలా మంచి ఫ్రెండ్‌షిప్. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా కనెక్ట్ అయ్యారు. నేను, మానస్ ఎంత బెస్ట్‌ఫ్రెండ్సో వాళ్లిద్దరూ అంత బెస్ట్‌ఫ్రెండ్స్' అంటూ ఆమెకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. సన్నీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. షణ్ను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా థ్యాంక్స్ మచ్చా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోహిణి అయితే వీడు బంగారం అంటూ సన్నీని మెచ్చుకుంది.
చదవండి: హగ్గుల గురించి తీయకు.. తల్లిగా చెప్పడం నా బాధ్యత.. ఏడ్చేసిన షణ్ను
Comments
Please login to add a commentAdd a comment