
'ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో అర్థం కావడం లేదు, పోనీ నేను లటుక్కుమని తినేయనా?' అని అడిగాడు. కాజల్ అందుకు పచ్చజెండా ఊపినప్పటికీ యానీ మాస్టర్ మాత్రం..
Bigg Boss 5 Telugu Today Promo: కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ఓ గిఫ్ట్ పంపాడు. నోరూరించే ఫుడ్ ఐటమ్‌ను పంపి ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది? అని అడిగాడు. దీంతో ఇంటిసభ్యులు దీని వెనకాల ఏమైనా మతలబు ఉందా? అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. ఇది చూసిన సన్నీ 'ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో అర్థం కావడం లేదు, పోనీ నేను లటుక్కుమని తినేయనా?' అని అడిగాడు. కాజల్ అందుకు పచ్చజెండా ఊపినప్పటికీ యానీ మాస్టర్ మాత్రం వద్దని వారించింది.
ఇక శ్రీరామ్ అయితే దాని చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరగా యానీ.. తాను కెప్టెన్‌ను కాబట్టి తినడానికి తనకే అర్హత ఉందని చెప్పింది. అయితే ఇంటిసభ్యుల అభిప్రాయం కూడా కనుక్కుందామని చూసింది. ఇంతలో ప్రియాంక.. నాకు మానస్‌కు ఇవ్వాలని ఉంది అనగా సన్నీ.. నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో, పో లోపలికి.. అని ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ కేక్ ఎవరు తిన్నారు? అసలు తిన్నారా? లేదా? అనేది తెలియాలంటే నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!