
Bigg Boss 5 Telugu, Transgender Priyanka Singh about Actress Priya: ప్రియ, ప్రియాంక.. పేర్లే కాదు.. వారి అభిరుచులూ కలిశాయి. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా మిగతా ఒకరు తల్లడిల్లిపోయేవారు. అంతలా క్లోజ్ అయ్యారిద్దరూ. తాజాగా ప్రియాంకసింగ్‌కు మర్చిపోలేని బహుమతిచ్చింది నటి ప్రియ. ఎంతో ఖరీదైన డైమండ్ రింగ్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని పింకీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్క ఇచ్చిన బహుమతి తెరచి చూడగానే ఒక్కసారిగా షాకయ్యాను. అందులో డైమండ్ రింగ్ ఉంది.. ఇది నేను ఊహించలేదు. థాంక్‌యూ, లవ్ యూ అక్కా.. అంటూ డైమండ్ రింగ్ ఫొటోను పోస్ట్ చేసింది.
దీని గురించి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రియక్కలో అమ్మను చూసుకున్నా.. ఆమె మనసు వెన్నలాంటిది. దుబాయ్ నుంచి బావగారు అక్కకోసం డైమండ్ రింగ్ తీసుకొచ్చారు. కానీ అక్క ఈ ఉంగరం నీకోసమే, నువ్వే పెట్టుకో అని నాకు బహుకరించింది. ఆ డైమండ్ రింగ్ కన్నా ప్రియ అక్క నాకు పెద్ద డైమండ్..' అంటూ ప్రియతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది పింకీ.
Comments
Please login to add a commentAdd a comment