
Bigg Boss Telugu 5 Promo, 13th Week Nominations: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌ను వీడటంతో హౌస్‌మేట్స్‌లో గుబులు మొదలైంది. వీరి టెన్షన్‌ను రెట్టింపు చేస్తూ బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ మొదలయ్యాయి. నామినేట్ చేయాలనుకున్న ఇంటిసభ్యుల ముఖం ఉన్న బాల్‌ను కాలితో తన్ని గేటు అవతల పడేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
సన్నీ శ్రీరామ్‌ను నామినేట్ చేయగా పింకీ ఎవరిని చేయాలా అని ఆలోచనలో పడింది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే ప్రియాంక ఏకంగా మానస్‌ను నామినేట్ చేసిందట. ఈ క్రమంలో వారిద్దరికి మధ్య కాస్త గొడవ కూడా జరిగినట్లు వినికిడి! అంతేకాకుండా గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్ చేసిన కాజల్‌ను సైతం నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం సిరి, కాజల్, మానస్, శ్రీరామ్, ప్రియాంక సింగ్ నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్ షణ్ముఖ్‌తో పాటు సన్నీ సైతం ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment